Begin typing your search above and press return to search.

'జూమ్‌' ఓన‌ర్ చంద్ర‌బాబుకు ఫోన్ చేశారా?

By:  Tupaki Desk   |   6 Oct 2020 7:15 PM IST
జూమ్‌ ఓన‌ర్ చంద్ర‌బాబుకు ఫోన్ చేశారా?
X
ఏ విష‌యాన్ని ప‌ట్టుకుంటే.. దానినే ప‌ట్టుకుని వేలాడే నేత‌గా పేరు పొందారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. గ‌తంలో ఆయ‌న ఐటీ అన్నారు.. ఇక సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను వ‌దిలేసి.. దాన్నే ప‌ట్టుకుని వేలాడారు. దీంతో ఆయ‌న‌ను అంద‌రూ ఐటీ బాబు అన‌డం ప్రారంభించారు. ఇక‌, గ‌త ఐదేళ్ల‌లో రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌ట్టుకుని వేలాడారు. పోనీ..ఏమ‌న్నా చేశారా? అంటే.. ఒక్క శాశ్వ‌త నిర్మాణం కూడా చేయ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. కానీ, ఆయ‌న మాత్రం అమ‌రావ‌తి బాబుగా నిల‌బ‌డిపోయారు. మ‌రికొన్నాళ్లు పోల‌వ‌రం ప్రాజెక్టుని ప‌ట్టుకుని వేలాడారు. పోనీ.. దీనిని ఏమైనా పూర్తి చేశారా? అంటే.. లేదు. కానీ.. సోమ‌వారాన్ని పోల‌వారం.. అంటూ పోల‌వ‌రం బాబుగా పేరు తెచ్చుకున్నారు.

ఇక‌, ఇప్పుడు ఆయ‌న `జూమ్‌` ప‌ట్టుకుని వేలాడుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో చంద్ర‌బాబుకు రెస్ట్ దొరికింద‌ని.. త‌మ‌కు `వాయింపు` ఉండ‌ద‌ని టీడీపీలో ఓ వ‌ర్గం నాయ‌కులు సంబ‌ర ప‌డ్డారు. ఇక‌, మీడియా కూడా అదే అనుకుంది. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి మీడియా మీటింగు లు పెట్టే ఆయ‌న నుంచి త‌మ‌కు వేద‌న త‌ప్పింద‌ని, ఆయ‌న‌ను ఎత్తే మీడియాలోనే చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ, బాబు ఊరుకుంటారా? `జూమ్` యాప్ ద్వారా నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి అందుబాటు లోకి వ‌చ్చేస్తున్నారు. దీంతో ఏపీ లో ఇప్పుడు ఎవ‌రిని అడిగినా.. జూమ్ బాబు ఎవ‌రు అంటే.. చంద్ర‌బాబే అని అంటున్నారు.

ప్ర‌పంచ రాజ‌కీయ నేత‌ల్లో జూమ్ యాప్‌ను ఎక్కువ‌గా ఎవ‌రు వాడుతున్నార‌నే విష‌యాన్ని జూమ్ నిర్వాహ‌కులు సెర్చ్ చేశారు. ఇంకేముంది.. మ‌న చంద్ర‌బాబేన‌ని స్ప‌ష్టమైంద‌ట‌. దీంతో జూమ్ ఓన‌ర్ నేరుగా బాబుకు ఫోన్ కొట్టార‌ని.. త‌మ యాప్‌ ను నిరంత‌రం వాడుతున్నందుకు బాబుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డంతో పాటు.. మ‌రిన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు కూడా అడిగార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు ప‌డుతున్నాయి. ఏదెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ క‌రోనా స‌మ‌యంలో జూమ్ ను ఎక్కువ‌గా వాడింది మాత్రం చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ త‌మ్ముళ్లే! బాబు జూమ్ యాప్ ద్వారా చేసిన రాజ‌కీయం.. అంతా ఇంతా కాద‌ని అంటున్నారు. నిత్యం త‌మ్ముళ్ల‌తో సమావేశాలు.. మీడియా మిత్రుల‌తో గంట‌ల కొద్దీ స‌మావేశాలు.. ఇలా ఒక‌రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నిత్య ఇదే తతంగం. దీంతో జూమ్ యాప్ చంద్ర‌బాబు కు కృత‌జ్ఞ‌త‌లు చెబితే.. త‌న‌కు అద్బుత‌మైన ప్లాట్ ఫాం ఇచ్చారంటూ.. బాబు వారికి థ్యాంక్స్ చెప్పార‌ట‌!! ఇదీ సంగ‌తి!!