Begin typing your search above and press return to search.

ఆయనను సీఎంగా చూడాలని ఉందన్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   16 April 2019 5:27 PM IST
ఆయనను సీఎంగా చూడాలని ఉందన్న  చంద్రబాబు!
X
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన మిత్ర పక్షాల కోసం తిరుగుతున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు కోసం పలువురు పార్టీల నేతలు ప్రచారానికి వచ్చిన సంగతి తెలిసిందే. దేవేగౌడ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారు ఏపీకి వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం చేసి వెళ్లారు.

ఇక ఏపీలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బాబు ఇప్పటికే కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేశారు. మండ్యలో దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడ తరఫున బాబు ప్రచారం సాగించారు. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచు సుమలతను ఓడించాలని పిలుపునివ్వడం పలువురి విమర్శలకు దారి తీసింది.

ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లారు. అక్కడ డీఎంకే తరఫున బాబు ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్నది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినా చంద్రబాబు నాయుడు.. స్టాలిన్ ను కీర్తించారు. స్టాలిన్ ను తమిళనాడు సీఎంగా చూడాలని ఉందంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

అన్నాడీఎంకే కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చంద్రబాబు నాయుడు అన్నారు. డీఎంకే కూటమిని గెలిపించాలని బాబు ప్రచారం చేస్తూ ఉన్నారక్కడ.

ఇక వీవీ ప్యాట్ల విషయంలో కూడా బాబు ధ్వజమెత్తారు. యాభై శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.