Begin typing your search above and press return to search.

30 కోట్ల సింగిల్ డే బాబు దీక్ష సిత్రాలెన్నో!

By:  Tupaki Desk   |   21 April 2018 5:06 AM GMT
30 కోట్ల సింగిల్ డే బాబు దీక్ష సిత్రాలెన్నో!
X
డ‌బ్బున్నోడు ఖ‌ర్చు చేస్తే జ‌రిగే న‌ష్టం పెద్ద‌గా ఉండ‌దు. అదే టైంలో చేతిలో డ‌బ్బు లేక.. అప్పులు తెచ్చి బండి న‌డిపించేవాడు ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయి లెక్క‌లోకి వ‌స్తుంది. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆర్థిక ప‌రిస్థితి ఉన్న వేళ‌.. ఖ‌ర్చు విష‌యంలో ఎంత అలెర్ట్ గా ఉండాలి? కానీ.. అదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా ఉండ‌టం ఏపీ సీఎం చంద్ర‌బాబుకే సాధ్య‌మ‌వుతుంది.

హోదా సాధ‌న విష‌యంలో నాలుగేళ్లుగా చెబుతున్న మాట‌ల‌కు భిన్నంగా నెల రోజులుగా బాబు మాట్లాడ‌టం తెలిసిందే. త‌న పుట్టిన రోజును రోటీన్ కు భిన్నంగా జ‌రుపుకోవాల‌న్న ఆలోచ‌న పుణ్య‌మా అని ఏపీ రాష్ట్ర ఖ‌జానాకు రూ.30 కోట్ల భారం పడిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా వేడ‌క‌ల స్థానే.. హోదా సాధ‌న కోసం ప‌న్నెండు గంట‌ల పాటుదీక్ష చేయాల‌ని బాబు డిసైడ్ అయ్యారు.

అంతే.. తాను చేసే దీక్ష‌కు ధ‌ర్మదీక్ష పేరు పెట్టేయ‌ట‌మే కాదు.. భారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందుకోసం ఏకంగా రూ.30 కోట్లు ఖ‌ర్చు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. మంచినీళ్ల కంటే దారుణంగా ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి త‌ర్వాతే ఎవ‌రైనా.. అడుగ‌డుగునా అధికార దుర్వినియోగంతో బాబు చేసిన దీక్ష వెగ‌టు పుట్టించిన ప‌రిస్థితి.

హోదా సాధ‌న కోసం ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు చేప‌ట్టే విప‌క్షాల‌కు బాబు త‌ర‌చూ క్లాస్ పీకుతుంటారు. నిర‌స‌నలు.. ఆందోళ‌న‌ల కార‌ణంగా ఉత్పాద‌క‌త‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. నిర‌స‌న‌ల్ని జ‌పాన్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని తెగ మాట‌లు చెబుతుంటారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు.. దానిపై త‌మ నిర‌స‌న తెలియ‌జేసేందుకు జ‌ప‌నీయులు రెగ్యుల‌ర్ గా చేసే ప‌నికి రెట్టింపు ప‌ని చేస్తార‌ని.. వారి గాంధీగిరితో దేశానికి మ‌రింత మేలు జ‌ర‌గ‌టంతోపాటు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరుగుతుంద‌ని చెబుతారు.

మ‌రీ మాట‌ను మ‌ర్చిపోయేలా బాబు చేప‌ట్టిన తాజా దీక్ష అంత గ్రాండ్ గా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది. దీక్ష కోసం చేప‌ట్టిన భారీ ఏర్పాట్లు.. ఖ‌ర్చు ఒక ఎత్తు అయితే.. అంతులేని అధికార దుర్వినియోగం చోటు చేసుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీక్ష పేరుతో రాజ‌కీయ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించిన సీఎం.. అధికార యంత్రాంగాన్ని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వాడేసుకోవ‌టం క‌నిపించింది. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల్ని పార్టీ కార్య‌క‌ర్త‌ల మాదిరి ప‌ని చేయించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌ల్ని ప‌లువురు సంధిస్తున్నారు. ధ‌ర్మ‌పోరాటం పేరుతో నిర్వ‌హించిన బాబు దీక్ష ను విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియంలో కొద్ది గంట‌ల పాటు హ‌డావుడి చేశారు చంద్ర‌బాబు. ఇందు కోసం చేసిన ఖ‌ర్చు రూ.30 కోట్లు దాటిన‌ట్లు చెబుతున్నారు.ఈ ఖ‌ర్చు లెక్క ఇలా ఉన్నా.. అధికార యంత్రాంగం మొత్తం దీక్ష మీద ఫోక‌స్ పెట్ట‌టంతో రాష్ట్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి.

ఇది స‌రిపోద‌న్న‌ట్లు కాలేజీ విద్యార్థులు మొద‌లుకొని వివిధ వ‌ర్గాల వారిని దీక్ష వ‌ద్ద‌కు పోటెత్తేలా చేశారు. వేదిక చుట్టూ భారీ ఎత్తున ఎసీలు.. సిలిండ‌ర్ దిండ్ల‌పై కూర్చొని విలాస‌వంత‌మైన దీక్ష‌ను అద్భుత రీతిలో ముగించారు. దీక్ష కార‌ణంగా కేంద్రంపై ప‌డిన ఒత్తిడి రూపాయి కూడా లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌యోజ‌నం కంటే ఖ‌ర్చు భారీగా మారింద‌ని.. బాబు దీక్షతో రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌క‌తప్ప‌దు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం శుక్ర‌వారం మొత్తం దీక్ష కార‌ణంగా ప‌ని చేయ‌ని ప‌రిస్థితి. ఇక‌.. దీక్ష‌కు వేదికైన విజ‌య‌వాడ‌లో అయితే గ‌డిచిన నాలుగు రోజులుగా విధి నిర్వ‌హ‌ణ‌ను వ‌దిలేసిన‌ట్లుగా చెబుతున్నారు. సీఎం స్వ‌యంగా దీక్ష చేస్తున్న‌ప్పుడు చేపట్టాల్సిన ప‌నులెన్నో ఉండ‌టంతో అధికార యంత్రాంగం మొత్తం దానిపైనే త‌మ ఫోక‌స్ అంతా పెట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.