Begin typing your search above and press return to search.

ఆత్మకూరు మంట.. బాబు - లోకేష్ హౌజ్ అరెస్ట్

By:  Tupaki Desk   |   11 Sept 2019 9:57 AM IST
ఆత్మకూరు మంట.. బాబు - లోకేష్ హౌజ్ అరెస్ట్
X
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందంటూ బుధవారం చలో ఆత్మకూరుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. టీడీపీ కుట్రలు చేధించేందుకు బాధితులతో కలిసి వైసీపీ కూడా చలో ఆత్మకూరుకు గురువారం రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఈ ఉదయమే రెడీ అయిన టీడీపీ - వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఇక చలో ఆత్మకూరుకు వెళ్లడానికి రెడీ అయిన మాజీ సీఎం చంద్రబాబు - ఆయన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతను హౌజ్ అరెస్ట్ చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు - టీడీపీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి.

కాగా లోకేష్ - చంద్రబాబులు చలో ఆత్మకూరుకు వెళ్లడానికి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయటకు వచ్చారు. పోలీసులు ఇద్దరినీ ఇంటిలోకి పంపించి హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.

తనను హౌస్ అరెస్ట్ చేయడంపై చంద్రబాబు భగ్గుమన్నారు. నిరసనగా 12 గంటల పాటు తన నివాసంలోనే నిరాహారదీక్షకు దిగుతానని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయమే చలో ఆత్మకూరుతో పేరు రాజకీయ లబ్ధి పొందడానికి టీడీపీ అధినేత వేసిన ఈ స్కెచ్ ను పోలీసులు అడ్డుకొని శాంతి భద్రతల కోసం ఈ పనిచేసినట్టు తెలిపారు.