Begin typing your search above and press return to search.
చంద్రబాబు కాళ్లకింద భూమి కదులుతోందా?
By: Tupaki Desk | 29 Oct 2019 2:15 PM ISTనేతలు జారిపోతున్నారు.. టీడీపీ అధినేత బేజారెత్తిపోతున్నారు. పార్టీపై శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. అందుకే బాబు రంగంలోకి దిగారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కాళ్లకింద భూమి కదులుతున్న చందంగా చంద్రబాబు యాక్టివ్ అయిపోయారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా రాజకీయ వ్యవహారాలపై చంద్రబాబు దృష్టిసారించారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడడం.. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ తో ప్రత్యేకంగా భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా.. అంతో ఇంతో టీడీపీ ప్రభాల్యం చాటింది ప్రకాశం జిల్లాలోనే. గత ఎన్నికల్లో వైసీపీని తట్టుకొని ఈ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. అయితే ప్రకాశం జిల్లాలో నేతల ప్రధాన ఆదాయ వనరుగా గ్రానైట్ పరిశ్రమ ఉంది. గ్రానైట్ క్వారీలు - అనుబంధ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. తాజాగా వీటిపై విజిలెన్స్ తనిఖీలు సాగుతుండడంతో నేతలు బెంబేలెత్తిపోతున్నారు. దీన్ని నుంచి తప్పించుకునేందుకు వైసీపీ బాట పట్టడానికి రెడీ అవుతున్నారన్న సమాచారం లీకైంది.
దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. తాజాగా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టు తెలిసింది. చీరాల - పర్చూరు - కొండపి ఎమ్మెల్యేలు కరణం బలరాం - ఏలూరి సాంబశివరావు - డీఎస్బీవీఎన్ స్వామితో ఆయన మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని.. క్యాడర్ ను కాపాడుకోవాలని ధైర్యం చెప్పినట్టు తెలిసింది. అద్దంకి ఎమ్మెల్యే ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.
ఇక ఫోన్ లో దొరకని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపారి రవికుమార్ తో చంద్రబాబు ఏకాంతంగా భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రవికుమార్ తోపాటు ఎమ్మెల్యే స్వామి - కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ముగ్గూరు కలిసి వచ్చినా చంద్రబాబు మాత్రం గొట్టిపాటి రవికుమార్ నే తన గదికి పిలిపించి దాదాపు 10 నిమిషాలు రహస్య భేటి కావడం చర్చనీయాంశమైంది. వల్లభనేని వంశీ టీడీపీని వీడిన తర్వాత రవికుమార్ తో చంద్రబాబు భేటి కావడం.. ఆయన అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.. రవికుమార్ మాత్రం ఇది సాధారణ భేటియేనని కొట్టిపారేయడం విశేషం.