Begin typing your search above and press return to search.
తమ్ముళ్లను వదిలిపెట్టి ఆలోచిస్తే కారణం తెలుస్తుంది!
By: Tupaki Desk | 14 Jun 2019 4:11 PM ISTకళ్లకు కారుమబ్బులు కమ్మినప్పుడు ఏమవుతుంది? వాస్తవం ఏది కంటికి కనిపించదు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చవిచూడని ఓటమిని ఎదురుచూసిన ఆయన.. ఇప్పుడు తీవ్ర నిరాశ.. నిస్పృహల్లో మునిగిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనకు మించిన పోటుగాడు.. అనుభవజ్ఞుడు తెలుగు నేల మీద మరొకరు లేరన్నట్లుగా ఫీలయ్యే బాబుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఒక పట్టాన అర్థం కావట్లేదు.
రెండంటే రెండు వారాల వ్యవధిలో ఏపీకి ఎలాంటి ముఖ్యమంత్రి కావాలన్న విషయాన్ని జగన్ తన చేతలతో చూపించేశారు. చిన్న వయసులో సీఎం అయినప్పటికీ ఎలాంటి త్రోటుపాటు లేకుండా సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
ఇదంతా చూస్తున్న చంద్రబాబుకు భవిష్యత్తు మీద కొత్త భయం పుట్టుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిందో అర్థం కావట్లేదన్నారు. గతంలో టీడీపీ ఓడినప్పుడు ఓటమికి ఏదో ఒక కారణం ఉండేదని.. ఈసారి ఎన్నికల్లో కారణాలు ఏమీ కనిపించని పరిస్థితి నెలకొందన్నారు.
లోటు బడ్జెట్ లోనూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన విషయాన్ని గర్తు చేస్తున్న చంద్రబాబు.. ఓటమికి కారణాలు పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచన చేశారు.ఐదుసార్లు టీడీపీ గెలిచినా ఎప్పుడూ ప్రత్యర్థులపై దాడులు చేయలేదన్న ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాల వ్యవధిలో వందకు పైగా దాడులు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తొలుత దాడుల గురించి మాట్లాడాల్సి వస్తే.. అధికార బదిలీ జరిగిన ప్రతిసారీ దాడులు ఏపీలో మామూలే. ఈ విషయం మీద మరింత క్లారిటీ కావాలంటే పాత పేపర్లను ఒకసారి తిరగేస్తే విషయం అర్థమవుతుంది. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవటం.. ఆయన దృష్టిని ఈ విషయాలు రాకపోవటం కూడా ఓటమికి కారణాలుగా చెప్పాలి.
ఇక.. టీడీపీ ఓటమి ఎందుకో అర్థం కాలేదన్న బాబు మాటను చూస్తేనే.. ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తన చుట్టూ ఉండే భజనపరుల్ని పక్కకు నెట్టి.. బాబు సాదాసీదాగా తయారై.. రోడ్డు మీదకు వచ్చి తాను చంద్రబాబును కాదన్నట్లుగా నలుగురితో మాట్లాడితే విషయం అర్థమవుతుంది. అది కష్టమైన పని అనుకుంటే.. కాస్త నికార్సుగా వ్యవహరించే జర్నలిస్టులను పిలిపించుకొని మాట్లాడితే వాస్తవాలు బోధ పడే అవకాశం ఉంది.ఓటమి ముంచేసి రెండు వారాలు దాటినా.. ఓటమి కారణాలు ఇంకా అర్థం కాకపోవటమే అతి పెద్ద వైఫల్యమన్న విషయాన్ని బాబు ఎప్పటికి గుర్తిస్తారో..?