Begin typing your search above and press return to search.
ప్రధానికి బాబు ఇచ్చిన నివేదికలో ఏం ఉన్నాయ్?
By: Tupaki Desk | 26 Aug 2015 10:07 AM ISTఎంతో కసరత్తుతో రూపొందించి.. అందులోని అంశాల్ని.. ఆ మాటకు వస్తే అందులో పొందుపర్చిన వాక్యాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ.. అక్షరం అక్షరం చదువుకుంటూ ప్రధాని మోడీకి ఇచ్చిన నివేదికలో ఏముంది? ఎన్ని పేజీల నివేదికను ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చారు? అందులో ప్రధానంగా ఏయే అంశాల్ని ప్రస్తావించారు లాంటి సందేహాలకు సమాధానాలు లభిస్తున్నాయి.
ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన నివేదికలోని అంశాల్ని ప్రధాని మోడీ నివాసం వద్దకు వెళ్లే సమయంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తగా మరోసారి చదువుకోవటం కనిపించింది. మరి.. ఆయన అంత శ్రద్ధగా చదువుకొని ప్రధానికి ఇచ్చిన నివేదిక వివరాలు చూస్తే.. మొత్తం 13 పేజీల్ని మోడీకి చంద్రబాబు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో మొత్తం నాలుగు అంశాలే ఉన్నాయంటన్నారు.
ఈ నాలుగు అంశాల్లో మొదటిది ఏపీకి ప్రత్యేక హోదా అయితే.. రెండోది.. ఆర్థిక లోటు భర్తీకి గ్రాంటుకు సంబంధించిన వివరాలుగా చెబుతున్నారు. ఇక.. మూడో అంశం ఏపీలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ.. ఉత్తరాంధ్రలకు చేయాల్సిన సాయం గురించి ఉన్నాయట. ఇక.. నాలుగో అంశంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి చేయాల్సిన సహాయం గురించి వివరాలు పొందుపర్చినట్లు చెబుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ దగ్గర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించింది ప్రధానంగా ఈ నాలుగు అంశాలే అయితే.. దాదాపు గంటన్నరకు పైనే సాగిన సమావేశంలో ఈ నాలిగింటికి సంబంధించి ఒక్క అంశం మీద కూడా ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవటం విశేషం. బాబు ఢిల్లీ యాత్రను ఒక్కమాటలో చెప్పాలంటే.. బాబు ఢిల్లీ వెళ్లారు.. వచ్చారన్నట్లుగా ఉంది తప్పితే ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నది వాస్తవం.