Begin typing your search above and press return to search.
బాబులో ‘లీడర్’ మిస్ అయ్యాడు
By: Tupaki Desk | 1 Aug 2016 10:24 AM ISTనాయకుడు అన్న వాడు ఎలా ఉండాలి? ఇలాంటి ప్రశ్నను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేయాల్సి రావటం ఇబ్బందికరమనే చెప్పాలి. సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న నేతగా.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన సత్తా ఉన్న చంద్రబాబు లాంటి రాజకీయ నేతను ‘లీడర్’ అనేటోడు ఎలా ఉండాలి లాంటి ప్రాధమికమైన ప్రశ్నను సంధించాల్సి రావటం దురదృష్టకరమైన అంశంగా చెప్పాలి. రాజకీయాల్లో అన్ని వేళలా అన్ని అంశాలు సాధ్యం కాకపోవచ్చు. అలా అని చేతులెత్తేసే ధోరణి కూడా మంచిది కాదు. ఇష్టం ఉన్నా.. లేకున్నా అందరిని కలుపుకెళ్లాల్సిన బాధ్యత అధినేత మీద ఉంటుంది.
ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు.. తనకుఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయాల్సి రావొచ్చు. కానీ.. వాటి పట్ల తనకున్న విముఖతను బయటపెట్టేలా మాటలు అస్సలు రాకూడదు. కానీ.. చంద్రబాబు తన మాటలతో విపక్షాల పట్ల తనకున్న వైఖరిని తన మాటలతో అందరికి అర్థమయ్యేలా చేయటం ఆశ్చర్యంగా అనిపించక మానదు.
ప్రత్యేక హోదా అంశంపై తాను చేస్తున్న పోరాటంలో కమిట్ మెంట్ ను ప్రశ్నించే అవకాశం ఏ ఒక్కరికి బాబు ఇవ్వకూడదు. కానీ..ఎందుకో బాబు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు అస్సలు కనిపించటం లేదు. తాను విపక్ష నేతగా ఉన్న సమయంలో జరుగుతున్న విభజన ప్రక్రియపై ఇదేచంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసేవారు. విభజనలాంటి పెద్ద కార్యక్రమాన్ని మొదలెట్టినప్పుడు అఖిలపక్షాన్ని వేయరా? పార్టీలతో చర్చించరా? వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకెళ్లరా? లాంటి ప్రశ్నల్ని చాలానే వేసేవారు.
మరి.. అలాంటి వ్యక్తి నేడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రత్యేక హోదా మీద రాజీ లేని పోరాటం చేస్తామని చెబుతున్నారు. అలాంటప్పుడు తనతో పాటు.. హోదా మీద గళం విప్పుతున్న విపక్షాల సహకారాన్ని ఎందుకు తీసుకోవటం లేదు. అందరిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి.. అంతా కలిసి ఉమ్మడి ప్రయత్నం ఎందుకు చేయకూడదు. అఖిలపక్షం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోదా మీద ప్రధానిని కలిసి సమస్యను వివరిస్తే తప్పేంటి? అలా అఖిలపక్షం వెళ్లగానే ఇలా మోడీ స్పందించి హోదా ఇచ్చేస్తారని అనుకోవటం భ్రమే.కానీ.. ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎన్నిరకాలుగా వ్యవహరించాలో అన్ని విధాలుగా ప్రయత్నించటం తప్పు లేదు కదా.
అదే విషయాన్ని ప్రస్తావించిన విలేకరుల మాటల్ని కాస్తంత ఎటకారం చేస్తూ.. నాలుగైదు పార్టీలతో ఏం జరుగుతుందని చెబుతూ.. రాజ్యసభలోని అన్ని పార్టీలు హోదాకు అనుకూలంగా మాట్లాడాయి కదా అని మాట్లాడటంలో అర్థం ఏమిటి? విపక్షాలు బంద్ లు ఎలా చేయాలో చెబుతున్న చంద్రబాబు.. ప్రత్యేకహోదా విషయంలో విపక్షాలతో కలిసి అధికారపక్షం ఉమ్మడి పోరాటం గురించి ఎందుకు మాట్లాడటం లేదు. ‘లీడర్’ అన్న వారు అందరిని కలుపుకెళ్లాలే తప్పించి తానొక్కడే అన్ని చేయాలని అనుకోవటం తప్పే అవుతుంది. హోదా ఇష్యూలో మొత్తం మైలేజీ తన సొంతం కావాలన్న దుగ్థ చంద్రబాబు చేత తప్పు చేయిస్తుందా? అన్న సందేహం కలగక మానదు.
హోదా విషయంలో జైట్లీ మాటల్ని టీవీల్లో చూసినంతనే గుండె మండిపోయిందంటూ మాటలు చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి..అంత మండిపోయినప్పుడు అలాంటి మంట తాలూకు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని మోడీకి తెలియజేయాల్సిన అవసరం లేదా? తమ ఎంపీలు మోడీని కలిసి.. ఒక వినతిపత్రాన్ని ఇచ్చేస్తే మోడీ సానుకూలంగా స్పందిస్తారా? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళితే ఏం జరుగుతుంది? అని ప్రశ్నిస్తున్నచంద్రబాబు.. తమ ఎంపీలు జట్టుగా వెళితే ఏం జరుగుతుందన్న ప్రశ్నను ఎందుకు వేసుకోరు? అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. హోదా మీద అఖిలపక్షం అన్నది ఒక ప్రయత్నం. కానీ.. దాన్ని చేయటానికి సైతం బాబు సిద్ధంగా లేనన్న మాటను నిర్మోహమాటంగా చెప్పేసిన బాబు పెద్ద తప్పునే చేశారన్న భావన వ్యక్తమవుతోంది. అందరిని కలుపుకెళ్లే ‘లీడర్’ లక్షణాలు తనలో మిస్ అయిన విషయాన్ని తన వైఖరితో బాబు స్పష్టం చేసినట్లే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి అలా వ్యవహరించటం ఏమిటి?