Begin typing your search above and press return to search.
మోడీతో బాబు భేటీ..చాంతాడంత జాబితా రెడీ
By: Tupaki Desk | 12 Jan 2018 1:00 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ‌్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అన్నివర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపుగా ఏడాది తర్వాత ఈ ఇద్దరు ముఖ్యుల సమావేశం జరుగుతుండటంతో మునుపటికంటే ఎక్కువ ఫోకస్ పడేలా చేస్తోంది.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రధానితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి ఢిల్లి బయల్దేరి వెళ్లారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యా లయం మోడీతో చంద్రబాబు సమావేశానికి అపాయింట్ మెంట్ ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయేవరకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆర్థిక - జల వనరులు - వ్యవసాయ - విద్యుత్ - హోం - మునిసిపల్ శాఖ ఉన్నతాధి కారులతో భేటీ అయ్యి పలు అంశాలపై కూలంకుషంగా చర్చించారు.
ఈ సందర్భంగా భారీ జాబితానే సీఎం చంద్రబాబు సిద్ధం చేసినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి రూ. 11 వేల కోట్ల మేర నిధులను కేటాయించాల్సిందిగా ప్రధానిని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. రాజధాని పరిధిలో నిర్మించే సచివాలయం - అసెంబ్లి - హైకోర్టు - వివిధ ప్రభుత్వ శాఖల భవనాల సముదాయం - ఉద్యోగులు - ప్రజా ప్రతినిధుల నివాసాల నిర్మాణం కోసం రూ.11 వేల కోట్లు అవుతుందని సీఆర్ డీఏ అంచనాలు రూపొందించారు. అయితే, ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ. 1500 కోట్లను విడుదల చేసింది. ప్రధానితో భేటీలో సమయం ఉంటే రాజధాని డిజైన్లను ప్రధాని మోడీకి చూపించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందుకోసం సీఆర్ డీఏ అధికారులను కూడా ముఖ్యమంత్రి తనతోపాటు ఢిల్లికి తీసుకెళ్లారు.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలు - పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక సహాయం - శాసనసభ నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన అంశాలపై మోడీతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో పాటు ముఖ్యమంత్రుల సమావేశంపై సైతం చర్చించే అవకా శాలున్నాయి.విశాఖ రైల్వే జోన్ - విదేశీ ఎయిడెడ్ ప్రాజెక్టులు - రానున్న సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలున్న నేపథ్యంలో మరో 50 నియోజకవర్గాలను పెంచాలనే విషయమై ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రధానితో ప్రస్తావిస్తారని తెలిసింది.
ఇదిలాఉండగా...తన పర్యటనలో భాగంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు తరచుగా చేస్తున్న విమర్శల విషయమై కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు - బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అధికార తెలుగుదేశం లక్ష్యంగా బహిరంగ విమర్శలకు దిగడంపై కూడా చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళతారని భావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో మిత్రపక్షంగా వుంటూనే మరోవైపు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆక్షేపణీయమంటూ మోడీ దృష్టికి బాబు తెస్తారని తెలుస్తోంది. అదే విధంగా రాజ్యసభలో వున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రధానికి స్పష్టీకరిస్తారు. ఈ విషయంలో నెలకొన్న మనస్పర్థలపై ఆయన వివరణ ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.