Begin typing your search above and press return to search.

జూబ్లీ హిల్స్ 'బాహుబ‌లి' ఎవ‌రు?

By:  Tupaki Desk   |   13 Sep 2018 8:37 AM GMT
జూబ్లీ హిల్స్ బాహుబ‌లి ఎవ‌రు?
X
తెలంగాణ‌లో ముందుస్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య పొత్తు దాదాపుగా ఖాయ‌మైన‌ట్లు ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టికెట్ల పంపకాల కోసం టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు మొద‌లెట్టారట‌. తెలంగాణ‌లో టీడీపీకి ప‌ట్టున్న స్థానాలేమిటో తెలుసుకునేందుకు ఏకంగా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల‌ను రంగంలోకి దించి స‌ర్వే చేయించార‌ట‌. 15 స్థానాల్లో టీడీపీ బ‌లంగా ఉంద‌ని....ఆ టికెట్ల‌ను టీడీపీకి కేటాయించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ 15 స్థానాల్లోని జూబ్లీ హిల్స్ స్థానంపై చంద్ర‌బాబు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీచేసి గెలుపుపొందిన మాగంటి గోపీనాథ్ ఈసారి కారెక్క‌డంతో జూబ్లీహిల్స్ `బాహుబ‌లి`ఎవ‌రన్న‌ది ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో సైకిలెక్కి విజ‌యం సాధించిన మాగంటి...ఈసారి కారెక్కారు. దీంతో, మాగంటిపై పోటీ చేసేందుకు స‌మ‌ర్థుడైన అభ్య‌ర్థి కోసం చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. అక్క‌డ బ‌రిలో నిలిచే అభ్య‌ర్థి మిగ‌తా స్థానాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌డ‌ని బాబు అనుకుంటున్నార‌ట‌. అందులోనూ, జూబ్లీహిల్స్ లో టీడీపీకి మంచి ప‌ట్టుంది. దీంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానం కోల్పోకూడ‌ద‌ని బాబు ఫిక్స్ అయ్యార‌ట‌. అందుకే, నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఒక‌రిని అక్క‌డ బ‌రిలోకి దించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ అది కుద‌ర‌క‌పోతే - సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఒక‌రిని పోటీలో నిల‌బెడ‌తార‌ట‌. దీంతో, జూబ్లీ హిల్స్ బాహుబ‌లి ఎవ‌రంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఆ పార్టీ నేత‌ల‌కు కూడా ఆ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న‌ది లీక‌వ్వ‌లేదు. మ‌రి, ఆ క్యాండిడేట్ గురించి బాబు క్లారిటీ ఎపుడు ఇస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.