Begin typing your search above and press return to search.

పవన్ మనోడే - బాబు

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:03 PM IST
పవన్ మనోడే - బాబు
X
పవన్ మనోడే.... ఆయన్ని విమర్శించవద్దూ... చెప్పింది చేయండి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతే కాదు పవన్ కల్యాణ్ మినహా భారతీయ జనతా పార్టీ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలను దుమ్ము దులపండీ... అంటూ తెలుగుదేశం పార్టీ నేతలను బాబు ఆదేశించారట.... అంతేకాదు ఈ మధ్య తెనాలి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఇటు పవన్ కల్యాణ్ - అటు చంద్రబాబు నాయుడు లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చారని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామంతో పవన్ ఎటువైపు ఉన్నారా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ నేతలతో టేలీ కాన్ఫరెన్స్ నిర్వాహించారు. ఈ కాన్ఫరెన్స్‌ లో కేంద్రంలో మోదీని - తెలంగాణలో కేసీఆర్‌ ను - ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ ను టార్గెట్ చేయాలని - వారిపై నెగటివ్‌ క్యాంపేయిన్ చేయమని సూచించినట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి - మరి పవన్ కల్యాణ్‌ మాటో అనగానే - పవన్ కల్యాణ్‌ను విమర్శించవద్దంటూ... నేను చెప్పినట్టు చేయండి అని చంద్రబాబు నాయుడు హుకూం జారీ చేయడంతో పవన్‌ మనోడే అన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. ఏ రెండు పార్టీలు తనకు వ్యతిరేకంగా కూటమి కట్టినా వారి విలువలు గూర్చి మాట్లడే చంద్రబాబు నాయుడు - గత పదిపదిహేనేళ్లలో దాదాపుగా అన్ని పార్టీలతో జత కట్టారని - కేంద్రంలో పాగా వేయడానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకునే ఆలోచనలో ఉన్నారని... అలాంటి బాబుకు తమను విమర్శించే హక్కు లేదని ఇటు వైసీపీ నేతలు - మరి టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిస్తే తప్పు లేదు కాని.... టీఆర్ ఎస్ - వైఎస్‌ సీపీ కలిస్తే తప్పా అని ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు.