Begin typing your search above and press return to search.
వంటల పోటీలు పెడితే.. పాలన సంగతేమిటో..?
By: Tupaki Desk | 7 Jan 2016 11:34 AM ISTఏవైనా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం.. ఇతరత్రా కార్యక్రమాల కోసం వంటల పోటీలు నిర్వహిస్తుండటం తెలిసిందే. అయితే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నంగా తెలుగువారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వంటల పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచన చేశారు.
గురువారం కర్నూలు నుంచి టెలికాన్ఫరెన్స్ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గ్రామస్థాయిలో వంటల పోటీలు నిర్వహించాలన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ఇవ్వటం లాంటివి మామూలే అనుకోండి. అయినా.. సుబ్బరంగా పాలనా వ్యవహారాలు చూడాల్సిన అధికారులు వాటిని వదిలేసి.. వంటల పోటీలు పెట్టుకోవటం ఏమిటో బాబుకే తెలియాలి. మహిళల మనసు దోచుకోవటానికి వంటల పోటీల కంటే కూడా.. వారి వంటింటి వస్తువుల ధరలు తగ్గింపుపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది కదా.