Begin typing your search above and press return to search.

పుష్కరాలు బాబుకు అచ్చిరావా..?

By:  Tupaki Desk   |   3 July 2016 4:40 PM GMT
పుష్కరాలు బాబుకు అచ్చిరావా..?
X
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్కరాలకు ఏ మాత్రం సెట్ కానట్లుగా కనిపిస్తోంది. అంగరంగ వైభవంగా నిర్వహించి.. జాతీయ స్థాయిలో తన పరిపాలనా దక్షతను ప్రదర్శించుకోవాల్సిన చంద్రబాబు.. పుష్కరాలంటే చాలు తప్పులో కాలేయటం అలవాటుగా మారినట్లుగా కనిపిస్తోంది. గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా వీడియో చిత్రీకరణ కోసం ఘాట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు గడపటం.. అనంతరం పుష్కర స్నానానికి వీలుగా జన సందోహాన్ని నిలువరించటంలో పోలీసు వ్యవస్థా.. అధికారులు దారుణంగా ఫెయిల్ కావటంతో.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి పుష్కరాల్లో భారీగా మరణించారు.

ఈ మచ్చ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించటమే కాదు.. గోదావరి పుష్కరాలు పూర్తి అయ్యే వరకూ తాకను రాజమండ్రి నుంచి పాలనను సాగించి..ఎట్టకేలకు తనదైన శైలిలో ఈ దారుణాన్ని మర్పిపోయేలా చేశారు. కానీ.. బాబు జమానాపై విరుచుకుపడేవారికి గోదావరి పుష్కరాల రిమార్క్ చెరగని ముద్రలా మారిందని చెప్పాలి.

గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ.. విజయవాడలో దేవాలయాలను పెద్ద ఎత్తున కూల్చేసే విషయంలో ప్రభుత్వ వైఫల్యం భారీగా మారింది. దేవాలయాల్ని కూల్చివేసిన ఘటనలో మొదట్లో ఎదురుదాడి చేసిన తెలుగు తమ్ముళ్లు.. కూల్చేసిన దేవాలయాలు.. అక్కడి స్థానికుల స్పందన లాంటి అంశాల్ని పరిశీలించి.. తమ అధాకారులు పెద్ద ఎత్తున తప్పులు చేశారంటూ వేదన చెందారు. దేవాలయాలు లాంటి సున్నిత అంశాల మీద అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఇప్పటి అధికారులకు ఉందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో అమాయక ప్రజలు పెద్ద ఎత్తున మరణిస్తే.. తాజాగా మొదలుకాని కృష్ణా పుష్కరాల్లో పెద్ద ఎత్తున దేవాలయాల్ని కూల్చేసిన ఘటన మాయని మరకలా బాబు జమానా మీద పడటం ఖాయమని చెప్పాలి.చూస్తుంటే చంద్రబాబుకు పుష్కరాలు అంత బాగా కలిసి వస్తున్నట్లుగా కనిపించట్లేదని చెప్పక తప్పదు.