Begin typing your search above and press return to search.
ప్రజలప్రాణాల్ని శూన్యంలో పెడతారా బాబూ!
By: Tupaki Desk | 5 Oct 2017 5:00 AM ISTచంద్రబాబునాయుడు సర్కారు ఏదో కొత్త టెక్నాలజీని తీసుకువచ్చేద్దాం అనే అపోహల్లో.. తెలిసీ తెలియని జ్ఞానంతో హైపర్ లూప్ టెక్నాలజీని మానవ రవాణాకు వినియోగించే సాహసం చేస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహా రవాణా వ్యవస్థను వస్తు రవాణాకు ఉపయోగించినా పర్లేదు కానీ.. మానవ రవాణాకు వినియోగించడం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని పలువురు అంటున్నారు. అయితే వస్తు రవాణా మాత్రమే చేసేట్లయితే ఈ విధానంలో అయ్యే వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని.. ఏమాత్రం భరించలేనిదిగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
హైపర్ లూప్ ట్యూబ్ రైలు లాంటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాలు మరో అడుగు ముందుకు పడుతున్నాయి. ఈ విధానంలో రెండు నగరాల మధ్య ఒక గాలి చొరబడని ట్యూబ్ (గొట్టం) ఏర్పాటు చేసి.. అందులో శూన్యం ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు ఎక్కే ట్యూబ్ ఆ శూన్యంలోనే ప్రయాణిస్తుంది. ఘర్షణ ఉండదు గనుక.. అతి వేగంతో వెళుతుంది. ఇదీ టెక్నాలజీ అయితే... ప్రయాణ సమయంలో ఏదైనా అవాంతరం వాటిల్లితే శూన్యంలో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అనేదానికి నిదర్శనాలు ఏమీ లేవు. ఎందుకంటే.. ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా ఈ హైపర్ లూప్ అమల్లో లేదు.
చెప్పుకోడానికి కాగితం మీద టెక్నాలజీ కనిపిస్తున్నదే తప్ప.. వీరు ఎన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చినా అమెరికా వంటి దేశాల్లోని ప్రభుత్వాలు కూడా దీనిని అమల్లోకి తేవడానిక సాహసించలేదు. అయితే ఇప్పటికే హైపర్ లూప్ వన్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్న చంద్రబాబు సర్కారు ఏ నమ్మకంతో ప్రజల ప్రాణాల్ని శూన్యంలో పెట్టడానికి సాహసిస్తున్నదో అర్థం కావడం లేదని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
హైపర్ లూప్ మార్గాన్ని తొలుత అమరావతి విశాఖ మధ్య ఏర్పాటు చేయాలని అనుకున్నారు. తర్వాత.. అమరావతి తిరుపతి మధ్య కూడా వేస్తాం అన్నారు. అయితే వందల వేల ఎకరాల కొద్దీ భూసేకరణ కొత్తగా దీనికోసం అవసరం అవుతుందనే నేపథ్యంలో.. ఈ మార్గం ద్వారా జరిగే రవాణా కూడా చాలా పరిమితమైనది కావడంతో.. లాభనష్టాలు బేరీజు వేసి.. ఎవ్వరూ దీనికి ఆమోదం తెలియజేయడం లేదు. ఆ తర్వాత.. కనీసం అమరావతి – విజయవాడ మధ్యనైనా దీనిని వేయాలనే ప్రతిపాదన పై ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు వారికి అప్పగించిన తర్వాత కసరత్తు జరుగుతోంది. నిజానికి అమరావతి – విజయవాడ మధ్య మలుపుల్లేని రోడ్డు వేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ఈ హైపర్ లూప్ ఎక్కి దిగేలోగా రోడ్డు మార్గంలోనే చేరిపోవచ్చుననే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.