Begin typing your search above and press return to search.
బాబుకు నచ్చినట్లే ఆంధ్రోడు మాట్లాడాలా?
By: Tupaki Desk | 30 Jan 2017 10:46 AM ISTఏపీలో కొత్త తరహా రాజకీయం మొదలైంది. నిన్న మొన్నటి వరకూ అధికారపక్ష నేతలు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఉత్త మాటలయ్యాయి. ఇప్పుడు పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే.. ఆర్నెల్ల క్రితం వరకూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లించిన మాటల్ని.. ఇప్పుడు ఆంధ్రా ప్రజానీకం మాట్లాడితే భరించలేనంత బూతుగా మారిపోయింది.
విభజన కారణంగా ఏపీకి చాలా నష్టం జరిగిందని.. హోదాతోనే దాన్ని భర్తీ చేయటం సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పిన మాటల్ని.. ఇప్పుడు ఎవరైనా గుర్తు పెట్టుకుంటే వారికంటే పెద్ద పిచ్చోడు మరొకడు ఉండరని చెప్పాలి. ఎప్పటికప్పుడు.. పరిస్థితులకు.. ప్రయోజనాలకు తగ్గట్లుగా మారిపోవాలి కానీ.. జరిగిన దాని గురించి.. ఫీలైన విషయాల గురించి అట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంది బాబు మైండ్ సెట్.
విభజన కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయటంతో పాటు..విశేష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటోడిక చేతికి పాలనా పగ్గాలు వస్తే ఏపీకి జరుగుతుందని నమ్మిన ఆంధ్రాప్రజానీకం బాబులోని అసలు విషయాన్ని మర్చిపోయారు. నమ్మిన వారికి ఏ మాత్రం సాయం చేయకపోవటం.. విశ్వాసంగా ఉన్న వారి గురించి పట్టకపోవటం.. మాట మీద నిలబడని తత్వ్తం బాబు నరనరాన ఉంటుందన్న విషయాన్ని ఏపీ ప్రజలు మర్చిపోవటం శాపంగా మారిందన్నట్లుగా మారింది.
ఆర్నెల్ల కిందట వరకూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. దాంతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని.. కేంద్రం కచ్ఛితంగా ఏపీకి న్యాయం చేస్తుందని.. ఒకవేళ వారు కానీ వెనక్కి తగ్గాలో ఏం చేయాలో అది చేస్తామంటూ బాబు చెప్పిన మాటల్ని తెలుగు తమ్ముళ్లు ఎప్పుడో మర్చిపోయారు. ఒకవేళ ఎవరైనా గుర్తు పెట్టుకొని అడిగే ప్రయత్నం చేస్తే.. పిచ్చోళ్లను చూసినట్లు చూస్తున్నారు. నమ్మినందుకు ఇంతలా మోసం చేస్తారా? అని కడుపు మండి పక్కనున్న తమిళుల్ని స్ఫూర్తిగా తీసుకొని శాంతియుత నిరసన చేద్దామని ప్రయత్నిస్తే.. జల్లికట్టు మీకు స్ఫూర్తిగా.. అయితే.. కోళ్ల పందాలు.. కుదరదంటే పందుల పందేలు ఆడుకోవాలి కానీ హోదా గురించి మాటలేంది? అదెప్పుడో ముగిసిన అధ్యాయం అంటూ సుజనా లాంటోళ్ల ఎటకారపు మాటల్ని వినాల్సిన దుస్థితి.
ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేస్తామని ఎవరైనా అంటే.. ఏపీని నాశనం చేయాలనుకుంటున్నారా? అభివృద్ధి చేసుకోరా? పెట్టుబడులు తెచ్చుకోరా? బుద్దిగా చదువుకోరా? అంటూ వెర్రి మొర్రి ప్రశ్నలు వేస్తూ.. పోలీసు బలాన్ని ప్రదర్శిస్తూ బాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.. అన్ని వదిలేయ్.. బాబును మాత్రమే ఫాలో అవ్వు. ఆయన నంది అంటే నంది అని అను. పంది అంటే పంది అని ప్రచారం చేయ్. నీకు మించిన ఆంధ్ర రత్నం ఏపీలోనే ఉండరన్నట్లుగా బాబు తీరు మారిందని చెప్పాలి. బాబుకు నచ్చినట్లు మాట్లాడితే సరే.. అందుకు భిన్నంగా మాట్లాడావా ఆంధ్రా ద్రోహివి అయినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/