Begin typing your search above and press return to search.
‘హోదా’పై అసలు గుట్టు విప్పేసిన బాబు
By: Tupaki Desk | 20 Sept 2016 9:51 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓపెన్ అయిపోయారు. ఇంతకాలం సందేహంగా అనిపించిన విషయం స్పష్టమైంది. హోదా మీద బాబు రాజీపడ్డారా? అన్న డౌట్నిజమని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం హోదాకు బదులుగా.. హోదా కారణంగా కలిగే ప్రయోజనాలన్నింటినీ తప్పక నెరవేరుస్తామంటూ చిలకపలుకులు పలుకుతూ.. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. హోదా హుష్ కాకి అయిందన్న విషయాన్నికేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ.. వెంకయ్యనాయుడులు స్పష్టం చేశారు. హోదావిషయంలో పోరాటం ఆపేది లేదని.. అదే సమయంలో కేంద్రం ఇచ్చేది తీసుకుంటూనే తమ పోరాటం తాము చేస్తామని చంద్రబాబు పలుమార్లు స్పష్టంచేశారు.
అయితే.. ఇదంతా ముందస్తుగా వేసుకున్న వ్యూహమన్న విషయం తాజాగా బయటపడిపోయింది. కృష్ణా జిల్లా నెమ్మలూరులో భెల్ కంపెనీ శంకుస్థాపన..మధురపూడి ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు భూమిపూజ కార్యక్రమాల్లో ఏపీ సీఎం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ..హోదాకు సమానమైన ప్యాకేజీ కాబట్టే అంగీకరించిన విషయాన్ని స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు హోదాపై రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పిన మాటల్లో నిజం లేదని.. హోదాపై బాబు రాజీ పడిపోయారని.. ప్యాకేజీతో సర్దుకోవటానికి సిద్ధమైన విషయం తాజాగా ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైన పరిస్థితి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని స్వాగితిస్తూనే హోదా మీద పోరాటం చేస్తానని తొలుత చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత అందుకు భిన్నంగా మాట్లాడటం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నా.. మరికొందరికి మాత్రం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించని పరిస్థితి. ఎందుకంటే.. బాబు తీరుపై తొలుత నుంచి సందేహాలు వ్యక్తం చేస్తున్న వారంతా.. ఇలాంటిదేదో జరుగుతుందని.. కేంద్రం దగ్గర సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల్ని బాబు తాకట్టు పెడతారని భావించినట్లే తాజా ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు.
హోదాతో ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభజన బిల్లు చర్చ సందర్భంగా నాడు ప్రధానిగా వ్యవహరిస్తున్న వ్యక్తి.. తనకు తానుగా రాజ్యసభలో ఒక రాష్ట్రానికి ఇచ్చిన హామీని.. అమలు చేయటానికి తర్వాతి రోజుల్లో భారత ప్రభుత్వం వెనక్కి తగ్గటం ఎలాంటి సంకేతాల్ని ఇస్తుందన్న విషయాన్ని మోడీ సర్కారు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఫెడరల్ సిస్టం స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు తీరుపై పలువురు సీమాంధ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హోదాతో వచ్చే లాభాలుభారీగా ఉన్నా.. కేంద్రంతో రాజీ ధోరణితో చంద్రబాబు ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఏపీ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించినట్లుగా.. ఓట్లకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే కేంద్రం దగ్గర సీమాంధ్రుల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేశారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
హోదా మీద రాజీ లేని పోరాటం అని చెప్పిన చంద్రబాబు.. దశల వారీగా తనపార్టీ నేతల చేత హోదాకు సమానంగా మోడీ సర్కారు ప్రకటించిన ప్యాకేజీ ఉందన్న మాటల్ని చెప్పించిన బాబు.. తర్వాతి కాలంలో ప్యాకేజీ ప్రకటనలో కీలకభూమిక పోషించిన వెంకయ్యకు ఘనంగా సన్మానం చేసిన వైనాన్నిమర్చిపోకూడదు. బాబు తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. మనసులోఉన్న విషయాన్ని మాటల రూపంలో తాజాగా కుండ బద్ధలు కొట్టేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఏమీ లేదని తేల్చేసి.. సీమాంధ్రుల గుండెలు మండేలా చేశారని చెప్పక తప్పదు.