Begin typing your search above and press return to search.
పని తక్కువ..ప్రయాణాలే ఎక్కువవుతాయి బాబు?
By: Tupaki Desk | 27 Feb 2016 5:15 AM GMTగొంతెమ్మ కోరికల్ని కోరే హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన కీలక డిమాండ్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యన ముఖ్యమంత్రిని కలిసిన నేతలు తమ డిమాండ్ల చిట్టాను విప్పారు. అందులోకీలకమైనది వారానికి ఐదు రోజుల పని విధానం. జూన్ నుంచి ఏపీ సచివాలయాన్ని అమరావతి నుంచి ఆపరేట్ చేసేందుకు వీలుగా ఏపీ సర్కారు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లోని ఉద్యోగులంతా ఏపీకి తరలాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చెప్పినట్లే జూన్ నాటికి అమరావతికి వచ్చేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులు.. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని కల్పించాలని కోరారు. దీనిపై ఆలోచిస్తామన్న ముఖ్యమంత్రి.. తాజాగా సానుకూలంగా స్పందించారు. వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పని దినాలు తగ్గించిన నేపథ్యంలో పని గంటలు కాస్త పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. పెరిగిన పని గంటలు ఇంటి నుంచి చేసేలా చూడటం లాంటివి చేసే వెసులుబాటు కల్పిస్తారన్న మాట వినిపిస్తోంది.
ఒకవేళ అలాంటిదే జరిగితే.. అంతకు మించిన పెద్ద తప్పుడు నిర్ణయం మరొకటి ఉండదు. ఎందుకంటే.. సచివాలయ సిబ్బంది వారానికి ఐదు రోజలు పని దినాల డిమాండ్ వెనుక పెద్ద ఆలోచనే ఉందని చెప్పొచ్చు. అమరావతికి వచ్చేస్తున్న ఉద్యోగులు అత్యధికుల ఫ్యామిలీలు హైదరాబాద్ లోనే ఉండనున్నాయి. వీలైనంత ఎక్కువగా హైదరాబాద్ లో ఉండాలన్నది వారి ఆలోచన. వివిధ కారణాల వల్ల ఇప్పటికిప్పుడు హైదరాబాద్ ను వదిలేసి అమరావతికి వెళ్లలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో వారానికి ఐదు రోజుల పని దినాల వెసులుబాటు వారికి పెద్ద ఊరడింపు. ఉదాహరణకు సోమవారం నుంచి శుక్రవారం వరకే పని దినాలు ఉంటాయి. అంటే.. శుక్రవారం పని నుంచి ముందే వెళ్లిపోయి.. సోమవారం కాస్త అటూఇటూగా వస్తే దాదాపు మూడు రోజులు కవర్ అయినట్లే. ఒకవేళ.. ఏ గురువారం కానీ సెలవు వస్తే.. శుక్రవారం సెలవు పెట్టేస్తే ఏకంగా మళ్లీ సోమవారమే ఆఫీసుకు వచ్చే వీలుంది.
ఫ్యామిలీతో గడిపే దాని కంటే.. ఆఫీసులో పని చేయటానికి మొగ్గు చూపే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో.. సచివాలయ ఉద్యోగుల పనితీరు మరింత మదగించే ప్రమాదం ఉంది. దీనికి తోడు..ఇంటినుంచి పని చేసే వెసులుబాటు ఇవ్వనుండటంతో దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవటం ఖాయం. అయితే.. ఇలాంటి వెసులుబాటుతో ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఎంతన్నదే పెద్ద ప్రశ్న.
ఐటీ ఉద్యోగాల్లో ఇంటి దగ్గర నుంచి పని చేసే విధానం అమల్లో ఉన్నా.. ఉద్యోగులు చేసే పని మీద ఒక డేగ కన్ను ఉంటుంది. వారి పనిని మదింపు చేసే వ్యవస్థ పక్కాగా పని చేస్తుంది. ప్రభుత్వాల్లో అలాంటి వర్క్ నేచర్ ని ఆశించలేం. వెసులుబాటును తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఏపీ సచివాలయ పనులు నత్త నడకకు మించిపోయే ప్రమాదం ఉందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.