Begin typing your search above and press return to search.
ఆ రెండు నెలల లోటే రూ.8500కోట్లు..?
By: Tupaki Desk | 8 April 2015 9:42 AM ISTవినటానికి వింతగా ఉన్నా.. లెక్కలు చెబుతున్న నిజం ఇదే. విభజనతో ఏపీ ఆర్థికలోటు భారీగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మొదట్లోవేసిన అంచనా ప్రకారం రూ.13వేల కోట్లు ఉంటుందని.. రూ.16వేల కోట్లు ఉంటుందని అనుకున్నారు. కానీ.. 2014-15 ముగిసిన ఆర్థిక సంవత్సరం లోటు ఏకంగా రూ.20వేల కోట్లుగా తాజాగా తేల్చారు.
ఏపీ రెవెన్యూశాఖాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. 2014 ఆర్థిక సంవత్సరంలో సమైక్య రాష్ట్రం చివరి నెలలు అయిన ఏప్రిల్.. మే రెండు నెలలకు సంబంధించిన లోటే రూ.8500కోట్లుగా లెక్క తేల్చారు. ఈ విషయం ఏపీ ఆడిటింగ్‌లో తేలిందన్నారు. మిగిలిన పది నెలల లోటు రూ.12వేల కోట్లుగా తేలుస్తున్నారు. మొత్తంగా ఏపీ లోటు విభజన తొలి ఏడాది రూ.20వేల కోట్లుగా లెక్క తేలింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉమ్మడిరాష్ట్రం చివరి రెండు నెలల్లో లోటును రెండు రాష్ట్రాలు కలిసి పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన 58;42శాతం చొప్పున రెండు రాష్ట్రాలు పంచుకుంటే ఏపీకి రూ.4930కోట్లు రావాల్సి ఉంటుంది. మరి.. దీనిపై తెలంగాణ సర్కారు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అన్నది సందేహంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోని చివరి రెండు నెలలకు సంబంధించిన ఖర్చులన్నీ ఏపీ సర్కారు పేరు మీదనే జరిగాయి. దీంతో.. ఖర్చు చేసిన రూ.8500కోట్లు ఏపీ పేరు మీదనే లెక్కలు జరిపారు. దీంతో.. అంత భారీ లోటును ఏపీ మోయాల్సి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లోటులో తమ వాటాను పంచుకోవటానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.