Begin typing your search above and press return to search.

బాబు పండుగ చేసుకుంటే.. అభివృద్ధి ఆగుతుందా?

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:10 PM GMT
బాబు పండుగ చేసుకుంటే.. అభివృద్ధి ఆగుతుందా?
X
టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. నిజంగానే వ‌ర్క్ హాలిక్‌. ఈ విష‌యంలో ఏ ఒక్క‌రికి కూడా అనుమానాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే బాబు దిన‌చ‌ర్య‌ను ప‌రిశీలించిన వారితో పాటు... బాబు ప‌నితీరుపై కాస్తంత అవ‌గాహ‌న ఉన్న వారు, బాబు పాల‌న‌లో తొమ్మిదిన‌రేళ్ల పాటు కొన‌సాగిన తెలుగు ప్ర‌జ‌లు ఆయ‌న ప‌నితీరు గురించి వేరే ఎవ‌రితోనే చెప్పించుకోవాల్సిన స్థితిలో అయితే లేర‌నే చెప్పాలి. తెల్లార‌గ‌ట్లే నిద్ర లేచే చంద్ర‌బాబు... రాత్రి పొద్దు పోయే దాకా నిత్యం స‌మీక్ష‌ల‌తోనే కాలం వెళ్ల‌దీస్తారు. ఇక అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అధికార యంత్రాంగాన్ని ఎలా ప‌రుగులు పెట్టిస్తారో కూడా మ‌న‌కు తెలిసిందే. మ‌రి ఇన్ని విష‌యాలు తెలిసిన తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు తానెంత క‌ష్ట‌ప‌డుతున్నాన‌న్న విష‌యం చెప్పాల్సినంత అవ‌స‌రం ఉందంటారా? అందునా త‌న కుటుంబ స‌భ్యులను ప్ర‌త్యేకించి త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ పేరును ప్ర‌స్తావిస్తూ ఆయ‌న తానెంతగా ప‌నిచేస్తున్నాన్నో చెప్పాల్సిన అవ‌స‌రం ఉందంటారా? ఈ ప్ర‌శ్న‌ను ఏ తెలుగోడికి వేసినా లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.

ఎందుంక‌టే... బాబు ప‌నితీరు అంద‌రికీ తెలుసు కాబట్టి. అయినా ఇప్పుడీ విష‌యాన్ని ప్ర‌త్యేకించి ఎందుకు చెప్పాల్సి వ‌స్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే... ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్రబాబు అర‌బ్ కంట్రీస్‌ కు వెళ్లిన సంద‌ర్భంగా... ఏపీ అభివృద్ధికి తానెంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నాన‌నే విష‌యాన్ని ఏక‌రువు పెట్టారు మ‌రి. ఇలాంటి సంద‌ర్భంలోనైనా బాబు మాట‌ల గురించి మ‌నం చ‌ర్చించుకోకపోతే ఎలా చెప్పండి. అందుకే ఈ క‌థ‌నం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఏపీ అభివృద్ధికి అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న తాను ఎన్నో విలువైన‌, మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌కు దూరంగా ఉండాల్సి వస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. న‌వ్యాంధ్ర అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న తాను అస‌లు త‌న కుటుంబాన్నే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని - క‌నీసం బుడిబుడి అడుగులు వేస్తున్న త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ అచ్చ‌ట ముచ్చ‌ట కూడా తీర్చ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాన‌ని చంద్ర‌బాబు ఏక‌రువు పెట్టారు.

ఏపీ అభివృద్ధే ల‌క్ష్యంగా ఇప్ప‌టికే తాను విజ‌య‌వాడ‌లో ఉంటుంటే - త‌న మ‌న‌వ‌డు దేవాన్ష్ మాత్రం త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద హైద‌రాబాదులో ఉంటున్నాడ‌ని, క‌నీసం మ‌న‌వ‌డి ముచ్చ‌ట తీర్చేందుకైనా హైద‌రాబాదు వెళ్లి వ‌ద్దామంటే వీలు చిక్క‌డం లేద‌ని ఇదివ‌ర‌కే చంద్ర‌బాబు త‌న దీనావ‌స్థ‌ను బ‌హిరంగ స‌భా వేదిక‌ల‌పైనే చెప్పేశారు. తాజాగా త‌న మ‌న‌వ‌డి బ‌ర్త్ డే వేడుకల‌ను కూడా జ‌ర‌ప‌లేద‌ని, ఇందుకు కార‌ణం తాను ఏపీ అభివృద్దిలో నిమ‌గ్న‌మ‌వ‌డ‌మే కార‌ణ‌మ‌ని కూడా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అయితే చంద్ర‌బాబు మాట‌లు నిజంగానే త‌న‌ను న‌మ్మిన వాళ్ల‌తో పాటు మొత్తం ఏపీ ప్ర‌జ‌ల చెవిలో పువ్వులు పెట్టిన చందంగానే మారాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎంత‌గా ప‌నిచేసినా... కుటుంబ వ్య‌వ‌హారాల‌కు తాను దూర‌మ‌వుతున్నాన‌ని చెప్పిన రాజ‌కీయ నేత ఇప్ప‌టిదాకా లేర‌నే చెప్పాలి. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి ప్ర‌ధాని ప‌ద‌వి దాకా అలంక‌రించిన ఏ ఒక్క నేత నోటా ఈ మాట వినిపించిన దాఖ‌లా లేదు. మ‌రి చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఈ త‌ర‌హా మాట‌లు ఎందుకు చెబుతున్న‌ట్టు?

ఎవ‌రిని ఫూల్స్ చేయ‌డానికి ఆయ‌న ఈ మాట‌లు చెబుతున్నారు అన్న విష‌యానికి వ‌స్తే... చంద్ర‌బాబు పాల‌న‌తో పాటు ఇత‌ర సీఎంల పాల‌న‌ను గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ఏమాత్రం ఫూల్స్ చేయ‌లేరు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌తో ఫూల్స్ అవుతున్న వారు ఎవ‌రైనా ఉన్నారంటే... వారంతా చంద్ర‌బాబు అభిమానులేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌తి విష‌యాన్ని త‌న కుటుంబానికి అంట‌గ‌ట్టేస్తున్న చంద్ర‌బాబు త‌న ప‌రువుతో పాటు పార్టీ ప‌రువు కూడా తీసేస్తున్నార‌ని కూడా ఆయ‌న అనున‌చ‌ర వ‌ర్గం తెగ బాధ‌ప‌డిపోతోంద‌న్న వాద‌న లేక‌పోలేదు. అయినా సీఎం హోదాలో ఉన్న వ్య‌క్తి సింగిల్ ఫోన్ కాల్‌తో మొత్తం వ్య‌వ‌స్థ‌ను చ‌క్క‌దిద్దే స్థాయిలో ఉండి కూడా... రాష్ట్ర అభివృద్ధి కోసం తాను త‌న కుటుంబానికి దూరంగా ఉన్నాన‌ని, త‌న మ‌న‌వ‌డి బ‌ర్త్ డే వేడుక‌లు కూడా జ‌రుపుకోలేద‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అన్న ప్ర‌శ్న ఇప్పుడు చంద్ర‌బాబు అనుచ‌ర వ‌ర్గంతో పాటు ఏపీ ప్ర‌జ‌ల్లోనూ కాస్తంత గ‌ట్టిగానే వినిస్తోంద‌ట‌. మ‌రి ఈ త‌ర‌హా వాద‌న‌లు విని అయినా చంద్ర‌బాబు త‌న వైఖ‌రి మార్చుకుంటారో, లేదో చూడాలి.