Begin typing your search above and press return to search.

బాబు విజ‌న్ చూస్తే షాకే!

By:  Tupaki Desk   |   24 Dec 2016 5:30 PM GMT
బాబు విజ‌న్ చూస్తే షాకే!
X
తెలుగుదేశం పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ‌న‌రీ అనే పేరుంది. అయితే ఎంత దూర‌దృష్టి కలిగి ఉన్న‌ప్ప‌టికీ అది మ‌రీ అతి విశ్వాసం స్థాయికి పోకూడ‌దు క‌దా? స‌రిగా ఇపుడు చంద్ర‌బాబు విష‌యంలో అదే జ‌రిగిందని అంటున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కల్పనతోపాటు నియోజకవర్గంలోని వైకాపా ప్రజాప్రతినిధులను ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలోనే ఉందని, అక్కడి ఎమ్మెల్యే టిడిపిలో చేరటం సంతోషకరమన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో బ్ర‌హ్మండ‌మైన ఆద‌ర‌ణ ఉంద‌ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు.

తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని, ఇటీవల సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడైందని చంద్ర‌బాబు తెలిపారు. ప్ర‌తిప‌క్షాల‌కు అస‌లు ప్రజాద‌ర‌ణే లేద‌ని, తెలుగుదేశం పార్టీయే అన్ని సీట్లు గెలుచుకుంటుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందన్నారు. కల్పన చేరికను ప్రస్తావిస్తూ గ‌త ఎన్నిక‌ల్లో ఆమె చేతిలో ఓడిపోయిన వర్ల రామయ్య మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల నాయకులు సహకరించాలని, రాష్ట్భ్రావృద్ధి కోసం అంతా సమష్టిగా పని చేయాలని చంద్ర‌బాబు కోరారు. కాగా...త‌మ పార్టీ గెలుస్తుంద‌నే భ‌రోసా రాజ‌కీయాల్లో త‌ప్పు కాద‌ని, అయితే తాము ఒక్క‌ర‌మే గెలుస్తామ‌ని పేర్కొన‌డం ఏమిట‌ని పలువురు విస్మ‌యం వ్య‌క్తం వ్య‌క్తం చేశారు.

ఇదిలాఉండ‌గా...తెలుగుదేశం పార్టీలోకి మరోసారి రావడం స్వగృహంలో అడుగుపెట్టినట్లుందని ఈసందర్భంగా ఎం మ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీచేసి ఓడిపోయానని, కొన్ని కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లినా ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేపోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే టీడీపీలో చేరినట్లు చెప్పారు.పార్టీలోకి పునఃప్రవేశించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు తాను అన్నలా తోడుంటానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్ వర్ల రామయ్య అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/