Begin typing your search above and press return to search.
బాబు పొలిటికల్ లైఫ్ లోనే తొలిసారంట
By: Tupaki Desk | 20 Nov 2016 9:00 PM ISTఎలాంటి మాట అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వినలేదో.. అలాంటి మాటను తొలిసారి బాబు నోటి వెంట వినే పరిస్థితి. సమస్య ఏదైనా సరే ఇన్ స్టెంట్ సొల్యూషన్ ఉందన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో భూమి.. ఆకాశం కలిసేంతగా హడావుడి సృష్టించి పని ఏదోలా పూర్తి చేసే మొండిఘట్టంగా చంద్రబాబును చెప్పాలి. అలాంటి ఆయన.. తొలిసారి కాసింత సిత్రమైన వ్యాఖ్యల్ని చేశారు.
నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా ప్రజలు తీవ్రస్థాయిలో కరెన్సీ నోట్ల కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరికి ఒకేలాంటి సమస్య ఎదురుకావటం.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని 13 రోజుల తర్వాత కూడా ఈ రోజుకీ సమస్య తీవ్రత అదే రీతిలో ఉండటంపై బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఒక సమస్యను ఇంత కాలంగా పూర్తి చేయకుండా ఉండిపోవటం తన పొలిటికల్ లైఫ్ లోనే తొలిసారిగా ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం పూట.. కలెక్టర్లు మొదలు ఆర్థిక శాఖ అధికారులు.. బ్యాంకర్లతో సమావేశమైన ఆయన.. నోట్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల్నితక్షణమే ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న ఆయన.. అన్ని బ్యాంకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో.. సహకారం.. సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని చెప్పిన ఆయన.. ఆర్ బీఐ నుంచి వస్తున్న రూ.2200 కోట్లలో వంద రూపాయిల నోట్లు ఏకంగా రూ.400 కోట్ల వరకూ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆర్ బీఐ నుంచి కరెన్సీ వచ్చిన నేపథ్యంలో నోట్ల సమస్యకు చెల్లుచీటి ఇచ్చేలా చర్యలు చేప్టటాలని స్పష్టం చేయటమే కాదు.. ప్రభుత్వ నిర్ణయాల్ని వినని బ్యాంకర్లకు నోటీసులు జారీ చేస్తామన్న వార్నింగ్ ను ఇచ్చేశారు. హైదరాబాద్ ను నిర్మించేశానని.. అద్భుతాల్ని సృష్టించానని పదే పదే చెప్పుకునే చంద్రబాబు.. తనకు తానుగా ఒక పనిని తాను చేయలేకపోయానని చెప్పే సిత్రమైన పరిస్థితి ఎదురుకావటం ఒక ఎత్తు అయితే.. ఇలాంటి పరిస్థితి ఆయన మిత్రుడైన మోడీ కారణం కావటం కొసమెరుపుగా చెప్పాలి. సో.. చంద్రబాబు చేయలేని పనులు కూడా ఉంటాయన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/