Begin typing your search above and press return to search.
బాబు లోకల్!... కేసీఆర్ నేషనల్!
By: Tupaki Desk | 28 Dec 2018 4:29 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల పాలనా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఎవరు ఎంత శక్తివంతులు? ఎవరు ఏ మేర ప్రణాళికలు రూపొందించగలరు? ఎవరు ఏ మేర ఆ ప్లాన్లను పక్కాగా అమలు చేయగలరు? అసలు వారి వారి పరిధులు ఎంత? ఎవరిది లోకల్? ఎవరిది నేషనల్? అసలు లోకల్ పరిధిని దాటే సత్తా ఎవరికుంది?... ఈ ప్రశ్నలన్నింటికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమాధానం చెప్పాలనే వారికి మాత్రం ముందుగా ఏపీ సీఎం - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి పేరు స్పురణకు వస్తుంది. అది కూడా రోజూ ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను లెక్కలేసుకుని చెబితే బాబు పేరు ముందు వస్తుంది. ఎందుకంటే... నిత్యం తన ప్రసంగాల్లో కేంద్రంపై నిప్పులు కక్కుతూ... ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటుగా... 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఓ రాష్ట్రానికి సీఎంగానే ఉన్నా... కేంద్రంలో చక్రం తిప్పానని - రాష్ట్రపతి అభ్యర్థులను కూడా తానే ఖరారు చేశానని - కొందరిని ఏకంగా ప్రధాని పీఠం కూడా ఎక్కించానని చంద్రబాబు చెబుతున్నారు కదా. ఈ ప్రసంగాలను మాత్రమే విని... ఇతర విషయాలను ఏమాత్రం పరిశీలించే తీరిక లేని వారు ముందుగా మనం చెప్పుకున్నట్లు... చంద్రబాబు పేరు చెబుతారు.
అయితే ఇటీవలి కాలంలో ఇటు చంద్రబాబుతో పాటు అటు టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిజీ షెడ్యూల్ ను పరిశీలించే వారు మాత్రం చంద్రబాబుపై తమ అభిప్రాయాన్ని మార్చేసుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఏమాత్రం పరిశీలన లేకుండా పై ప్రశ్నలకు చంద్రబాబు పేరును ఆన్సర్ గా ఇచ్చే వారు... కాస్తంత నిత్యం జరుగుతున్న అంశాలను కాస్తంత పరిశీలించి చూస్తే మాత్రం తమ ఆన్సర్ ను కేసీఆర్ గా మార్చుకోక తప్పదు. ఎందుకంటే... మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా తనను ఓడించేందుకు రంగంలోకి దిగినా... సింగిల్ గానే ఫైట్ లో ఘన విజయం సాధించి - 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుతో సహా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను మట్టికరిపించేసిన కేసీఆర్... ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ పై దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ - బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేస్తానంటూ రంగంలోకి దిగిపోయిన కేసీఆర్... ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో బిజీబిజీగా ఉన్నారు. తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే... ఢిల్లీలో తమకంటూ ఓ కార్యాలయం ఉండాలి కదా అన్న కోణంలో ఆలోచించిన కేసీఆర్... ఇప్పుడు ఢిల్లీలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ స్థాపన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. సో... ఇంట గెలిచేసిన కేసీఆర్ ఇప్పుడు రచ్చకెక్కారు. రాష్ట్ర స్థాయిలో తనకు తిరుగు లేదని నిరూపించుకున్న కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసినట్లుగానే చెప్పాలి.
ఈ కోణంలో చంద్రబాబు విషయాన్ని తీసుకుంటే... కేసీఆర్ కు పూర్తి భిన్నమైన వాదన వినిపించుకోక తప్పదు. ఎందుకంటే... ఎన్నికలు వస్తున్నాయంటేనే బెంబేలెత్తిపోయే చంద్రబాబు... తనతో కలిసివచ్చే పార్టీలేవన్న అంశంపైనే దృష్టి సారిస్తారు. సింగిల్‌గా పొలిటికల్ ఫైట్ కు ససేమిరా అనే చంద్రబాబు... ఎన్నికలు వస్తున్నాయంటే తన వెంట నడవడంతో పాటు తనకు అండగా నిలిచే ఏదో ఒక పార్టీ కావాల్సిందేనన్న వాదన లేకపోలేదు. సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఇప్పుడు చంద్రబాబు తీవ్ర డోలాయమాన పరిస్థితిలో ఉన్నారు. గడచిన ఎన్నికల్లో వెన్నంటి నడిచిన బీజేపీతో సున్నం పెట్టుకున్న చంద్రబాబు... ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీని స్థాపించారో - ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టారు. ఆ కలయికను కూడా తెలంగాణ ప్రజలు గట్టిగానే తిరస్కరించడంతో మరో ఐదు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనతో కలిసి నడిచే పార్టీ ఏదన్న విషయం తేలక చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇలాంటి కీలక సమయంలోనూ చంద్రబాబు నోట జాతీయ రాజకీయాల మాట వినిపిస్తున్నా... ఆచరణలో మాత్రం పక్కా లోకల్ పాలిటిక్స్ కే పరిమితం అవుతూ తన బేలతనాన్ని చాటుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు మాటల్లో ఉన్నదంతా డాంబికమేనని - అసలు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయంటేనే బెంబేలెత్తిపోయే చంద్రబాబు... ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ఎలా చెప్పగలుగుతారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. వెరసి నేషనల్ పాలిటిక్స్ నెరిపేంత ధైర్యం చంద్రబాబుకు లేదనే చెప్పాలి. అంటే... చంద్రబాబు పక్కా లోకల్ లీడరేనన్న మాట. అయినా ఇంట గెలిస్తే కదా... రచ్చ గెలవడానికి. నిజమే ఈ లెక్కన చూసుకున్నా... తాజా రాజకీయ పరిణామాలు పరిశీలించినా... కేసీఆర్ నేషనల్ లీడర్ గా,. చంద్రబాబు లోకల్ లీడర్ గా కనిపిస్తారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.