Begin typing your search above and press return to search.

షాకింగ్:రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు బాబు గైర్హాజ‌రు!

By:  Tupaki Desk   |   26 Jan 2018 8:20 AM GMT
షాకింగ్:రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు బాబు గైర్హాజ‌రు!
X
ఉమ్మ‌డి - విభ‌జ‌నానంత‌ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ చరిత్రలో ఈ గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఓ చేదు అనుభ‌వంగా మిగిలిపోనున్నాయి. తొలిసారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ......రిప‌బ్లిక్ డే వంటి జాతీయ పండుగలో పాల్గొనకపోవడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనూహ్యంగా..... ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు....ఈ సారి గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌కు హాజ‌రుకాలేక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న విమానం ఆల‌స్యం కావ‌డంతో ఆయ‌న రాలేక‌పోయారని అధికారులు చెబుతున్నారు. అప్ప‌టికే జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఆల‌స్య‌మ‌వ‌డంతో - గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్....జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్....పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఏపీకి చెందిన ప‌లువురు మంత్రులతోపాటు సీఎం సతీమణి భువనేశ్వరి - మనవడు దేవాన్ష్ లు గ‌ణ‌తంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

నేడు దేశ వ్యాప్తంగా 69వ గణతంత్ర వేడుకలను ఆయా రాష్ట్రాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అధికారిక హోదాలో ఈ వేడుల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గణతంత్ర వేడుక‌ల కోసం ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది. అయితే, నిన్న దావోస్‌ పర్యటన ముగించుకున్న చంద్ర‌బాబు....శుక్ర‌వారం ఉదయం 7 గంటలకు అమరావతి చేరుకొని ....ఉద‌యం 11.28 నిమిషాల‌కు గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌ల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే, వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న విమానం ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది. ప్ర‌స్తుతం అబుదాబిలో ఉన్న చంద్ర‌బాబు....ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం చేరుకుంటార‌ని తెలుస్తోంది. 4 గంట‌ల స‌మ‌యానికి ఆయ‌న విజ‌య‌వాడ చేరుకొని రిపబ్లిక్‌ డే వేడుక‌ల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.