Begin typing your search above and press return to search.

నామినేటెడ్‌ పదవుల లోగుట్టు

By:  Tupaki Desk   |   10 April 2015 11:25 AM GMT
నామినేటెడ్‌ పదవుల లోగుట్టు
X
అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాని వారు, పార్టీలోని సీనియర్లు నామినేటెడ్‌ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూడటం తెలిసిందే. పాలకులు సైతం పార్టీ కోసం కష్టపడ్డ వారిని,వివిధ సమీకరణల నేపథ్యంలో పలువురిని నామినేటెడ్‌ పదవులకు ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా భర్తీ చేసిన నామినేటెడ్‌ పదవుల ప్రక్రియ ఇపుడు ఆసక్తికరంగా, ఒకింత చర్చనీయాంశంగా మారుతోంది.



ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటివరకు పలు నామినేటెడ్‌ పదవులు భర్తీ అయ్యాయి. అవి

ప్రభుత్వ సలహాదారు- పరకాల ప్రభాకర్‌

ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు- అగర్వాల్‌

ప్రభుత్వ ఐటీ సలహాదారు - జె.సత్యనారాయణ

ఏపీ నాలెడ్జ్‌ కౌన్సిల్‌ సీఈఓ- గంటా సుబ్బారావు

ఏపీ నాలెడ్జ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌- గ్రంథి మల్లిఖార్జున రావు(జీఎంఆర్‌)

ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌- వై. సాయిబాబు

రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు -సి.కుటుంబరావు

రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు శాశ్వత సభ్యుడు- ఎంసీ కాంతారావు

రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు సభ్యుడు- శ్రీనివాసులు

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి - కంభంపాటి రామ్మోహన్‌ రావు

సీఎం కార్యాలయం ఓఎస్డీ- అబిష్ఠ

ఏపీ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌- రావులపాటి సీతారామారావు

ఏపీ వికలాంగుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ - జి.కోటేశ్వరరావు

శాప్‌ చైర్మన్‌- పీఆర్‌ మోహన్‌



అయితే వీరిలో దాదాపు తొంభై శాతం మంది తెలుగుదేశం కోసం కష్టపడ్డ వారు కాకపోవడం ఆసక్తికరం! ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు, శాప్‌ చైర్మన్‌ పీఆర్‌ మోహన్‌, ఏపీ వికలాంగుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.కోటేశ్వరరావు, ఏపీ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ రావులపాటి సీతారామారావులు పార్టీలో సభ్యులు. ఆ మేరకు తమదైన శైలిలో కష్టపడ్డారు. ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ వై. సాయిబాబు పార్టీలో సభ్యుడు కానప్పటికీ తెరవెనక ఉండి పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు. సీఎం కార్యాలయం ఓఎస్డీ అబిష్ట చంద్రబాబు కుమారుడు లోకేష్‌ క్లాస్‌ మేట్‌.

వారు తప్ప మిగతా వారంతా గతంలో పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేనివారేనని తెలుగుదేశం శ్రేణులు పేర్కొంటున్నాయి. అలాంటి వారికి తీసుకొచ్చి పెద్దపీట వేస్తూ పార్టీకి పాటుపడ్డ వారిని నిరీక్షణలో ఉంచడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.