Begin typing your search above and press return to search.
హోదాపై అద్వానీ వ్యాఖ్యలు విన్నారా?
By: Tupaki Desk | 6 Aug 2016 10:15 AM ISTనిజంగా దురదృష్టం అంటే ఆంధప్రదేశ్ దేనని చెప్పక తప్పదు. బీజేపీకి కర్మ.. కర్త.. క్రియ లాంటి వాజ్ పేయ్.. అద్వానీ లాంటి వారున్న సమయంలో వాజ్ పేయ్ అనారోగ్యంతో కదల్లేని పరిస్థితిలో ఉంటే.. ఆరోగ్యంగా ఉన్న అద్వానీ సైతం ఏమీ చేయలేని పరిస్థితి. మోడీ ప్రాభవంతో పార్టీలో పరిస్థితులు ఎలా మారిపోయాయన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. బీజేపీలో అద్వానీ శకం పూర్తిగా ముగిసినట్లేనన్న అర్థం వచ్చేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.
కృష్ణా పుష్కరాలకు ఏపీకి రావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించేందుకు అద్వానీ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి మధ్యన ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చింది. ఈ అంశంపై స్పందించిన అద్వానీ.. ‘‘ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగకూడదు. రాష్ట్రానికి ఏమేం ఇవ్వాలో అవన్నీ త్వరగా ఇచ్చేయాలి. ఏపీకి ఇవ్వాల్సిన వాటిని ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకని.. మీరు జోక్యం చేసుకొని ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని సూచన చేయగా.. స్పందించిన అద్వానీ నిష్టూరంగా ఉంటే నిజాన్ని ఓపెన్ గా చెప్పేస్తూ.. పార్టీలో తనకు అంత సీన్ లేదన్న విషయాన్ని చెబుతూ.. ‘‘ఒకవేళ నాకే కానీ ఆ అధికారం ఉండి ఉంటే.. నిర్ణయాధికారం మీకే ఇచ్చేవాడిని’’ అని వ్యాఖ్యానించారు.
విడిపోవాలని అనుకున్న తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిపోయిన నేపథ్యంలోఆంధ్రాకి ఏం కావాలో వారికి ఇచ్చేయాలన్న అద్వానీ.. రెండు రాష్ట్రాల మధ్యనున్న ఇష్యూలను తేల్చేందుకు చక్కటి ప్లాన్ ఒకటి అప్పటికప్పుడు చెప్పేయటం గమనార్హం. తెలంగాణ నుంచి ఒకరు.. ఏపీ నుంచి ఒకరు.. కేంద్ర హోం శాఖ నుంచి ఒకరు కూర్చొని ఇష్యూలను తేల్చేయాలన్నారు. ఏపీ పట్ల అద్వానీకి ఉన్న సానుకూలతలో కొంతైనా మోడీకి ఉన్నా హోదా ఇష్యూ మీద ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో..?