Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఆఫర్ కు కాంగ్రెస్ ఓకే అంటుందా?
By: Tupaki Desk | 22 Aug 2018 11:39 AM ISTవచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ జోడీ కట్టడం దాదాపు ఖాయమైందనే చెప్పాలి. తాజాగా చంద్రబాబు తన పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమై దీనిపై అభిప్రాయం కోరడమే అందుకు సంకేతం. ఇప్పటికే పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు రెండు పార్టీల నేతలూ సఖ్యతగా మెలుగుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం వైపు నుంచి చంద్రబాబుకు పొత్తు ప్రతిపాదనలు రావడమే కాకుండా చంద్రబాబు అందుకు సానుకూలంగా స్పందిస్తుండడమూ జరుగుతోంది. తాజాగా మంగళవారం దీనిపై మరో అడుగు ముందుకుపడినట్లు సమాచారం. పొత్తులు కన్ఫర్మ్ చేసుకుందామంటూ దిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి చంద్రబాబుకు వర్తమానం అందినట్లు సమాచారం.
దిల్లీ నుంచి కబురు రావడంతో చంద్రబాబు వెంటనే అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి 17 ఎమ్మెల్యే - మూడు ఎంపీ స్థానాలు తీసుకుని.. ఏపీలో కాంగ్రెస్ కు 20ఎమ్మెల్యే - నాలుగు ఎంపీ సీట్లు కేటాయించాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఏపీలో అన్ని తక్కువ సీట్లకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఈ సమావేశంలో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందని నేతలను నేరుగా అడిగినట్లు సమాచారం. దీనికి పలువురు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారని... ప్రజలు రిసీవ్ చేసుకోరేమో అని అనుమానం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే... ఇప్పటికే చంద్రబాబు ఈ విషయంలో డిసైడ్ కావడంతో వారి అభ్యంతరాలను పక్కనపెట్టి పొత్తుకు నేతలు ఓకే చెప్పేలా చేశారట. చంద్రబాబు వైఖరి అర్థం కావడంతో అభ్యంతరాలు చెప్పిన నేతలు కూడా నిర్ణయం మీదే అంటూ ఎప్పటిలా ఆయనకే అప్పగించి సైలెంటయిపోయారని సమాచారం.
అంతేకాకుండా... కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ప్రజల్లో సానుకూలత వచ్చేలా మీడియా సాయంతో తాను నడిపించుకుంటానని చంద్రబాబు నేతలతో అన్నట్లు టాక్. మంత్రులు కళా వెంకట్రావు - అచ్చెన్నాయుడు - ఆనందబాబు - కాలవ శ్రీనివాసులు - సుజయకృష్ణ రంగారావు - లోకేశ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు అంశంపై - ముందస్తు ఎన్నికల అంశంపై - ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ విధానంపైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో వ్యవహరించాల్సిన వైఖరిపై చంద్రబాబు సమాలోచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.