Begin typing your search above and press return to search.
భయంతో కూడిన ప్లానింగ్ తో బాబు చెప్పిన మాటలివి
By: Tupaki Desk | 18 Aug 2018 11:48 AM ISTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాబోయే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేదా? ఇప్పటికే ప్రధానప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున బలోపేతమైందన్న నివేదికలు ఆయన్ను కలవరపెడుతున్నాయా? ప్రజాధనం దుర్వినియోగం - అవినీతిని ప్రజలు గమనించిన విషయం బాబు దృష్టికి చేరిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీ నేతలకు తాజాగా ఆయన చేసిన సూచనలు భవిష్యత్ కోసమా? లేక భయంతోనా అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి.
ఢిల్లీ నుంచి తిరిగి రాగానే శుక్రవారం సాయంత్రం తన నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 28న జరగనున్న ముస్లిం మైనార్టీ సదస్సు నారా హమరా..టీడీపీ హమారా గురించి, ప్రస్తుతం జరుగుతున్న గ్రామ దర్శిని కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. సమీప భవిష్యత్తులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమర పాటు ఉండకూడదన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయివరకు పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకమవుతూ పార్టీ సిద్ధాంతాలను - గత నాలుగు సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల నుండి అందే విజ్ఞప్తులను, సమస్యలను ఆకళింపు చేసుకొని వాటి పరిష్కారానికి కృషిచేస్తూ పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని కోరారు.ఇంకా చేయాల్సిన పనులను అడిగి తెలుసుకోవాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాకబు చేయాలని వాటన్నిటినీ క్రోడీకరించి నివేదికలు పంపాలన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని పేర్కొన్న బాబు ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో ఊదరగొట్టాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు ఇస్తున్న హామీలు - వారికి చేరువ అవుతున్న వర్గాలను గుర్తించాలని కోరారు.
కాగా,పోల్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు ప్రదర్శించే `చాణక్యం` గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో కేవలం తమ గురించి, తమ అభివృద్ధి విధానం గురించి మాత్రమే తెలియజెప్పే చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షాల ఎత్తుగడలను సైతం ఓ కంట కనిపెట్టాలని కోరడం చూస్తుంటే...రాబోయే ఎన్నికల పట్ల బాబు భయంతో ఉన్నారా? లేదా భవిష్యత్ ప్రణాళికల్లో ఇదో భాగమా అనే చర్చ జరుగుతోంది. ఇటు అధికార వర్గాలు, అటు ప్రైవేటు సంస్థలచే చేసుకున్న సర్వేల్లో పూర్తి వ్యతిరేకత కనిపించిన నేపథ్యంలోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.