Begin typing your search above and press return to search.

బాబు.. హైదరాబాద్‌ మీద మీకు హక్కు లిమిటెడే..!

By:  Tupaki Desk   |   9 Jun 2015 10:05 AM IST
బాబు.. హైదరాబాద్‌ మీద మీకు హక్కు లిమిటెడే..!
X
అత్తారింటికి దారేది సినిమాలో లాస్ట్‌ సీన్‌ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ కంపెనీలో నాకు 60 శాతం ఉంది.. నా మాటకే ఎదురు చెబుతావా అంటూ పవన్‌ కల్యాణ్‌ తాత పాత్రధారి నిలదీస్తుంది. మీకున్నది 60 కాదు.. 45శాతమే. మీ కూతురు సునంద మీద మిగితాది ఉంది. ఆమె రారు.. అని చెప్పే సమయంలో సినిమాటిక్‌గా ఆమె సీన్లోకి ఎంటరై.. కథను మార్చేస్తుంది. అది సినిమా. కాబట్టి డైరెక్టర్‌ అనుకుంటే.. ఐదు నిమిషాల్లో కిటకిటలాడే రైల్వే ఫ్లాట్‌ఫాం ఖాళీ అయిపోతుంది. కానీ.. ఇది రియల్‌. ఇందులో ఎలాంటి సినిమాటిక్‌ సన్నివేశాలకు ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి.

రేవంత్‌రెడ్డి లాంటి నేత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పులినోట్లో తల పెడితే తప్పితే.. ఆపరేషన్‌ రేవంత్‌రెడ్డి లాంటి వీడియోసీడీలు తయారు కావు. అలాంటప్పుడు మంగళగిరిలో జరిగిన మహాసంకల్ప సభలో మాట్లాడిన చాలా మాటలు మాట్లాడిన బాబును వెంటనే కరెక్ట్‌ చేయాలనిపిస్తోంది.

హైదరాబాద్‌ మీద మీకు ఎంత హక్కు ఉందో.. మాకూ అంతే హక్కు ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంత ప్రాంతమే అన్న విషయం మర్చిపోకూడదు. హైదరాబాద్‌ మీద ఇద్దరు సీఎంలకు సమాన అవకాశం ఉందని చెబుతున్నారు. అది సుద్ద తప్పు. హైదరబాద్‌ మీద వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ బక్కసానికే వెళుతుంది తప్ప రూపాయి కూడా ఏపీకి రాదు.

అంత వరకూ ఎందుకు.. చంద్రబాబు హైదరాబాద్‌లోని తన ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వెళ్లాలన్నా.. కాన్వాయ్‌కి రూట్‌ క్లియర్‌ అని చెప్పాలన్నా అది తెలంగాణ ప్రభుత్వ పోలీసులే చేయాలి. బాబు బయటకు అడుగు పెట్టాలంటే తెలంగాణ పోలీసుల పర్మిషన్‌ తీసుకోవాల్సింది. ఇది ఉమ్మడి రాజధానిలో ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న అధికారం. అలాంటప్పుడు పదేళ్లు మీకు ఎంత అధికారం ఉందో.. మాకూ అంతే అధికారం ఉందని చెప్పే చంద్రబాబు తనకు అన్‌లిమిటెడ్‌ కాదు.. లిమిటెడ్‌ పవర్‌ మాత్రమే ఉందన్న విషయం మర్చిపోకూడదు.