Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ప‌ప్పులో కాలేశాడా?

By:  Tupaki Desk   |   11 April 2020 3:00 AM IST
చంద్ర‌బాబు ప‌ప్పులో కాలేశాడా?
X
దేశం ఏమ‌వుతున్నా.. ప‌రిస్థితులు ఎలా ఉన్నా రాజ‌కీయ పార్టీ నాయ‌కుల వైఖ‌రిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. ముఖ్యంగా అధికార - ప్ర‌తిపక్ష పార్టీల మ‌ధ్య రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా ఉంటాయి. ఈ రాజ‌కీయాలు సాధార‌ణ ప‌రిస్థితుల్లో చేస్తే ఓకే. కానీ ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌ తో పోరాడుతున్న స‌మ‌యంలో.. దేశ‌మంతా లాక్‌ డౌన్ విధించిన సంద‌ర్భం.. ప్ర‌జ‌లంతా క‌ష్టాలు ప‌డుతున్న ఈ త‌రుణంలో కూడా రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాదు. మాన‌వ‌త్వం పేరిట రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఏర్ప‌డింది. తాజాగా ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌బోయి కొంద‌రు ఇబ్బందుల్లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అలాంటి రాజ‌కీయం చేయ‌బోయి ప‌ప్పులో కాలేశాడు.

గుంటూరు జిల్లా న‌ర్సీప‌ట్నం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు నాయుడు స్పందించాడు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని - ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌క్ర‌మంగా ప‌ని చేయ‌డం లేద‌ని.. వైద్యులు - వైద్య సిబ్బందికి ఏర్పాట్లు - సౌక‌ర్యాలు - ప‌రిక‌రాలు అందించ‌డం లేద‌ని.. కొర‌త ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అత‌డి ఆరోప‌ణ‌ల‌ను ఆస‌రాగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఆయ‌న విమ‌ర్శ‌ల వెనుక రాజ‌కీయం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తం ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ న‌డిపించ‌ద‌ని తెలుస్తోంది.

అయితే చివ‌ర‌కు ప్ర‌భుత్వం స్పందించి ఆ వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్‌ పై ఆరోప‌ణ‌లపై విచార‌ణ చేసింది. అత‌డు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం.. ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేసేందుకు య‌త్నించాడ‌ని గుర్తించి ప్ర‌భుత్వం అత‌డిని స‌స్పెండ్ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు ఝ‌ల‌క్ ప‌డింది. దీంతో చంద్ర‌బాబు కూడా ఇర‌కాటంలో ప‌డ్డారు. అంత సీనియ‌ర్ నాయ‌కుడు వెనకాముందు ఆలోచించ‌కుండా.. విచార‌ణ చేయ‌కుండా స్పందించ‌డంతో ప‌ప్పులో కాలేసిన‌ట్టయ్యింది. అయితే ఈ వ్య‌వ‌హార‌మంతా న‌డిపింది తెలుగుదేశం పార్టీ నాయ‌కులే. సీఎం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టేలా చేయాల‌ని ప్లాన్ వేసి వైద్యుడితో ఆరోప‌ణ‌లు చేయ‌గా మొద‌టికే మోసం వ‌చ్చి ప‌డింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌క్కా క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల కోసం ఈ విధంగా లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతార‌నే విష‌యం మ‌ర‌వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాల్సింది పోయి ఈ విధంగా ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డంపై అధికార పార్టీ నాయ‌కుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ నాయ‌కులు ఇలాంటి వాటిలో జోక్యం చేసుకుని ప‌రువు తీసుకున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో చ‌ర్చ జ‌రుగుతోంది.