Begin typing your search above and press return to search.

గెలుపు... బాబుకా...? దేశానికా..?

By:  Tupaki Desk   |   25 Oct 2018 9:42 AM IST
గెలుపు... బాబుకా...? దేశానికా..?
X
" ఈ ఎన్నికల్లో మనం గెలవాలి. ఇది చారిత్రక అవసరం"తెలంగాణ తెలుగుదేశం నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి." ఇక్కడ ఈసారి మనమే గెలవాలి. ఇది చారిత్రక అవసరం"ఈ మాటలు కూడా చంద్రబాబు నాయుడు అన్నవే. అయితే ఈ వ్యాఖ్య‌లు చేసింది ఆంధ్రప్రదేశ్‌ లో.తెలంగాణలోనూ - ఆంధ్రప్రదేశ్ లోనూ కూడా ఎన్నికల్లో విజయం సాధించాల్సింది చంద్రబాబు నాయుడా.... లేక తెలుగుదేశం పార్టీయా... అని ఆ పార్టీలో నాయకులకే అనుమానాలొస్తున్నాయి. విజయం కోసం చంద్రబాబు నాయుడే కాదు... ఏ రాజకీయ నాయకుడైనా ఉవ్విళ్లూరుతారు. కాని చంద్రబాబు నాయుడు మాత్రం తన విజయమే చారిత్రక విజయమంటూ చీటికీమాటికీ చెప్పడమే ఆ పార్టీ నాయకులకు - ప్రతిపక్షాలకు... ఆ మాట కొస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా అర్ధం కాకుండా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసిందంటూ భారతీయ జనతా పార్టీతో జట్టుకట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల వరకూ ఎలాంటి చారిత్రక అవసరాలు గుర్తుకు రాలేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు.

ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ ప్లేటు ఫిరాయించడంతో కంగు తిన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన విజయమే ముఖ్యమని పదేపదే చెప్పడాన్నే ఆ పార్టీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా స్ధానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానంటే అప్పుడు సరే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అనడం వెనుక మతలబు ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తన పార్టీ అధికారంలోకి రాకపోతే తాన భవిష్యత్ పై చంద్రబాబు నాయుడికి నీలినీడలు కమ్ముకున్నాయా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.దీనిని ద్రష్టిలో ఉంచుకునే చంద్రబాబు నాయుడు మాటిమాటికీ చారిత్రక అవసరం అనే మాటను వాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈసారి ఓడిపోతే ఏమవుతుంది - మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటారు అంతే కదా అని విశ్లేషకులు అంటున్నారు. తాను ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చోవడం కంటే కూడా అంతకు మించినది ఏదో జరుగుతుందనే భయం చంద్రబాబు నాయుడ్ని వెంటాడుతోందని వారి అంచనా. కలిసి ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా సరెండర్ అయిన చంద్రబాబు నాయుడు తన గుట్టుమట్లు ఆ పార్టీ పెద్దలకు చెప్పారని - అవే ఇప్పుడు చంద్రబాబునాయుడ్ని ఇరుకున పెడుతున్నాయా అని అనుమానాలు వస్తున్నాయి. పార్టీలో ఓ వర్గం వద్దని వారించినా... తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకమని తన వారే చెప్పినా ఆ పార్టీతో పొత్తుకు ముందుకు రావడం వెనుక చంద్రబాబు నాయుడి భయమే కారణమని అంటున్నారు. దీన్ని బట్టి ఈ ఎన్నికల్లోనూ.... రానున్న ఎన్నికల్లో తన విజయమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారని - తాను అధికారంలోకి రాకపోతే విపరీత పరిణామాలు జరుగుతాయని ఆయన ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.