Begin typing your search above and press return to search.

బాబు కొత్త గెటప్ చూశారా?

By:  Tupaki Desk   |   10 July 2016 10:37 AM IST
బాబు కొత్త గెటప్ చూశారా?
X
మితంగా మాట్లాటం.. సీరియస్ గా ఉండటం.. పని తప్ప మిగిలిన విషయాల్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండటం లాంటివి మాటలు ప్రస్తావించిన వెంటనే.. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో ఇట్టే అర్థమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది కాస్త డిఫరెంట్ స్టైల్. ఇప్పుడంటే కాస్త నవ్వుతున్నారు కానీ.. తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఆయన ముఖం మీద నవ్వు పెద్దగా కనిపించేది కాదు.

నిత్యం పని.. పని అనటమే తప్ప మరో మాట ఆయన నోటి వినిపించేది కాదు. ఆయనంటే చాలు ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోయేవారు. తెల్లారింది మొదలురాత్రి వరకూ ఆయన ఎప్పుడూ ఎలా రియాక్ట్ అవుతారో తెలీక.. గుండెలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసేవారు. ఎప్పుడు ఎక్కడ ఆకస్మిక తనఖీలంటూ తాట తీస్తారో అని వణికిపోయేవారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఆయనకు ఎదురైన అనుభవాలు ఆయన్ను పూర్తిగా మార్చేసింది.

ఆ అనుభవమే ఆయన మాటను మార్చేయటమే కాదు.. ముఖంలో నవ్వుల్ని తీసుకొస్తోంది. ఆత్మీయంగా మాట్లాడటం.. భావోద్వేగంతో ప్రసంగించటం.. ఉద్యోగుల పట్ల సున్నితంగా వ్యవహరించటం (దాన్నే ఉద్యోగులు అలుసుగా తీసుకొని సరిగా పని చేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి).. తప్పు చేసిన వారి పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం లాంటివి బాబులో వచ్చిన మార్పులు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. కజకిస్థాన్ పర్యటన సందర్భంగా ఆయన వేసుకున్న డ్రెస్ అదిరిపోయింది. అక్కడి సంప్రదాయ వస్త్రధారణలో బాబు కొత్తగా మెరిసారు. దీనికి తోడు.. ముగ్గురు ముద్దుగుమ్మల మధ్యన అక్కడి సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు తన టీంతో కలిసి దిగిన ఫోటో మీద అందరి దృష్టి పడేలా ఉంది. సంప్రదాయ దుస్తులు ధరించటం మామూలే అయినా.. తన టీంతో.. అక్కడి స్థానిక యువతులతో దిగిన ఫోటో మాత్రం కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి. రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా ఉన్న ఈ పిక్.. ను చూస్తే.. ముద్దుగుమ్మల మధ్య బాబు మెరిసిపోయినట్లుందని చెప్పక తప్పదు.