Begin typing your search above and press return to search.

బాబు మీడియామేనేజ్ మెంట్.. ఇది మచ్చుతునక.

By:  Tupaki Desk   |   24 Feb 2019 5:48 AM GMT
బాబు మీడియామేనేజ్ మెంట్.. ఇది మచ్చుతునక.
X
మీడియా మేనేజ్ మెంట్ కింగ్ అయిన చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశాడు. తనకు వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నా వాటిని మేనేజ్ చేసే పనిలో పడ్డారు. ఇటీవలే ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఒక చానెల్ సర్వే చేసింది. అందులో ఎవరు గెలుస్తారనే విషయంపై స్పష్టతనిచ్చింది. లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ లీడ్ లోకి వస్తుందని.. అధికారం జగన్ దే అని కుండబద్దలు కొట్టింది.

ఇక తాజాగా ఓ జాతీయ ఇంగ్లీష్ చానెల్ కూడా ఏపీ రాజకీయ పరిస్థితిపై అధ్యయనం చేసిందట.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు తీసి ఆ సర్వేను పూర్తి చేసింది. అందులో చంద్రబాబుకు దిమ్మదిరిగే ఫలితాలు వచ్చినట్టు టాక్. దీంతో సదురు చానెల్ ఆ సర్వే ఫలితాలను ముందుగా టీడీపీ అధినేతతో పంచుకున్నట్టు సమాచారం. ఏపీలో మొత్తం 175 స్థానాల్లో ప్రతిపక్ష వైసీపీకి 140కు పైగా స్థానాలొస్తాయని.. టీడీపీకి 25 నుంచి 30లోపే సీట్లు వస్తాయని సర్వేలో తేల్చారట.. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సర్వే ప్రసారం కావద్దని చంద్రబాబు గట్టిగా లాబీయింగ్ చేసి ఆపించేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ సర్వే గుబులు రేపాకే చంద్రబాబు ఏపీ ప్రజలపై సంక్షేమ పథకాల జల్లు కురిపించారు. ఇబ్బడిముబ్బడిగా పథకాలు ప్రకటించేశారట.. వాటితో పరిస్థితి మారుతుందని.. కాబట్టి మళ్లీ ఇప్పుడు సర్వేచేసుకోవాలని సదురు ఆంగ్ల చానెల్ కు సూచించారట . బాబు చేసిన ప్రతిపాదనకు ఆ చానెల్ ప్రతినిధులు కూడా సరేనని లేటెస్ట్ గా ఇప్పుడు మరో సర్వేకు శ్రీకారం చుట్టారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

బాబు తన మీడియా మేనేజ్ మెంట్ తో ఆ ఇంగ్లీష్ చానెల్ సర్వేను తొక్కిపట్టి మళ్లీ కొత్త సర్వేను చేయించారన్న వార్త ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఎంతైనా బాబు మీడియా మేనేజ్ మెంట్ లో తిరుగులేదని ఈ సంఘటనతో రుజువైంది.