Begin typing your search above and press return to search.

బాబు తన మనవడిని చూసి ఎంతకాలమైందంటే.!

By:  Tupaki Desk   |   30 Sept 2015 5:39 PM IST
బాబు తన మనవడిని చూసి ఎంతకాలమైందంటే.!
X
ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే వ్యక్తి ఎవరో మీకు తెలుసా...? దయచేసి ఒబామా పేరో... జుకర్ బర్గ్ పేరో... లేదంటే ముఖేశ్ అంబానీ పేరో... నరేంద్ర మోడీ పేరో చెప్పొద్దు... వారంతా వారివారి పెళ్లాంబిడ్డలను - కుటుంబాలను పట్టించుకుంటున్నారు... స్నానం చేసినాకే మీటింగులకు వెళ్తున్నారు. కానీ, నిద్రాహారాలు - కుటుంబం.. చివరకు స్నానం కూడా చేయడం మరిచి పనిచేస్తున్న ద మోస్ట్ బిజీ పర్సన్ ఇన్ ది వరల్డ్ మాత్రం మన తెలుగోడే. ఆయన ఇంకెవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఆయన నిద్రాహారాలు మాని పనిచేస్తారని... ఆయన నిద్రపోరు, ఇంకెవరినీ నిద్రపోనివ్వరని గత టెర్ములోనే ప్రజలకు తెలిసిపోయింది. తాజాగా మొన్న ఆయన సింగపూర్ వెళ్లొచ్చిన తరువాత ఇంకో విషయం తెలిసింది. అదేంటంటే... ఆయనకు టైం చాలక స్నానం చేయడం లేదని. బుధవారం ఇంకో కొత్త విషయం తెలిసింది. అది వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది. తన ఒక్కగానొక్క కుమారుడు లోకేశ్ కు జన్మించిన కుమారుడు దేవాన్షును చూడడానికి కూడా చంద్రబాబకు టైం లేదట. మనుమడిని చూసి ఆర్నెళ్లు అయిందంటున్నారాయన.

కొన్ని నెలలుగా తాను తన మనవడిని చూడలేదని చంద్రబాబు చెబుతున్నారు. బుధవారం ఆయన పార్టీ కమిటీలను ప్రకటించిన తరువాత తన గురించి, తన కుటుంబం గురించి కొంత ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.... ''మనవడ్ని చూసుకునే టైమ్ కూడా లేదు నాకు. నా చేతికి వాచీ - ఉంగరాలు లాంటివి కూడా లేవు. నా జేబులో డబ్బులు కూడా ఉండవు... నా జీవితం తెరచిన పుస్తకం'' అంటూ చెప్పుకొచ్చారు. తాను కుటుంబం కంటే పార్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. లోకేశ్ పార్టీలో బాగా కష్టపడుతున్నందునే పదవి ఇచ్చామని ఆయన చెప్పారు.