Begin typing your search above and press return to search.
ఆ మాట మాట్లాడొద్దంటూ తమ్ముళ్లకు బాబు క్లాస్
By: Tupaki Desk | 4 Oct 2018 11:55 AM ISTఅసలే తెలుగు తమ్ముళ్లు. మితిమీరిన ఉత్సాహం ఎక్కువ. తమ అధినేత బాబుకు తగ్గట్లే బడాయి కబుర్లు చెప్పుకోవటం వారిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తమ బాబు స్థాయి ఏపీ ముఖ్యమంత్రి కాదని.. దేశ ప్రధాని అంటూ ఈ మధ్యన శ్రుతిమించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ విషయం మీద దృష్టి సారించటం మానేసి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని కుర్చీలో కూర్చునేది తమ బాబేనంటూ హడావుడి చేస్తున్నారు.
ఓపక్క మోడీతో సున్నం పెట్టుకోవటంపై కిందా మీదా పడుతూ.. తమ అవినీతి గుట్టుమట్లపై నిఘా సంస్థలు ఏం చేస్తాయో టెన్షన్ పడిపోతున్న బాబుకు.. మోడీ కన్ను తన మీద పడేలా వ్యాఖ్యలు చేయొద్దన్న మాట బాబు నోటి నుంచి పదే పదే వస్తోంది. తాను ప్రధానమంత్రి అవుతానంటూ తమ్ముళ్లు చేసే వ్యాఖ్యల కారణంగా జాతీయ రాజకీయాల్లో ఇబ్బందులు ఏర్పడే వీలున్నట్లుగా బాబు చెబుతున్నారు.
తాజాగా ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన బాబు.. ఇటీవల పార్టీ నేతలు తానుప్రధాని అవుతాననే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇలాంటి వాటితో లేనిపోని ఇబ్బందులు ఏర్పడే వీలుందని చెబుతున్నారు. తాను ప్రధాని అవుతానన్న ప్రచారాన్ని తక్షణమే ఆపివేయాలని తమ్ముళ్లకు సూచించారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని.. ఇలాంటి వేళ తాను ప్రధాని అవుతానంటూ పార్టీ నేతలు చేసే ప్రకటనలు ఇబ్బందికరంగా మారి.. కూటమి ప్రయోజనాలు దెబ్బ తినే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.అందుకే నోరు మూసుకొని ఉండటం మంచిదని.. ఒకవేళ మాట్లాడినా ఆచితూచి తప్పించి.. తాను ఆ పదవిని చేపడతానన్న హడావుడి మాటల్ని దగ్గరకు కూడా రానివ్వొద్దన్న మాటను చెప్పినట్లుగా తెలుస్తోంది.