Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను ప్రకటనతో కెలికిన చంద్రబాబు!
By: Tupaki Desk | 17 July 2018 10:08 AM ISTసాధించింది గోరంత అయినా కొండంతగా చెప్పుకోవటంలో ఇద్దరు చంద్రుళ్లు ఒకరికి మించిన వారు మరొకరని చెప్పక తప్పదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే. లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు వచ్చినట్లుగా భారీ ప్రకటనలు చేసినా.. నాలుగేళ్ల వ్యవధిలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అన్న విషయాన్ని లెక్క తీస్తే..బాబు మాటలకు వచ్చిన పెట్టుబడులకు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయం అర్థం కాక మానదు.
పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా.. సదరు రాష్ట్రం పెట్టుబడిదారులకు పెద్దపీట వేస్తూ.. వారికి ఇబ్బంది లేకుండా పాలనా పరమైన అనుమతుల్ని యమా ఫాస్ట్ గా ఇచ్చే రాష్ట్రాల విధానాలకు మార్కులు ఇచ్చి ర్యాంకులు ఇవ్వటం తెలిసిందే.
ఈ ర్యాంకుల పరంపరలో ఏపీ మొదటి స్థానంలో నిలించింది. రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం కేవలం 0.09శాతం మాత్రమే వెనుకపడింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తూ.. చాలా స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉందని.. అయినా.. ర్యాంకు ర్యాంకేనంటూ వినమ్రతతో వ్యాఖ్యానించాడు. అయితే తాను సాధించిన విజయాన్ని ఘన విజయంగా డప్పు కొట్టుకోవటంలో బాబు తర్వాతే ఎవరైనా.
ఈ రోజు దినపత్రికల్ని చూసినోళ్లకు భారీ కవర్ పేజీ జాకెట్ యాడ్ ను రెండు తెలుగురాష్ట్రాల్లోని తనకు అనుకూలమైన తెలుగు మీడియా సంస్థలకు బాబు ప్రభుత్వం ఇచ్చింది.
ఈ రోజు ఉదయాన్నే ఏపీతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్.. తెలంగాణ ఎడిషన్లకు జాకెట్ యాడ్స్ ఇచ్చేసిన చంద్రబాబు.. తనకు అనుకూలమైన మీడియా సంస్థలకు విందుభోజనం పెట్టేశారని చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటిస్థానం సాధించిన విషయంలో బాబు తీరును మెచ్చుకోవాల్సిందే. ర్యాంకు ప్రకారం చూసినప్పుడు ఏపీలో చక్కటి విధానం అమల్లో ఉంది. మరి.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలి కదా? ఎందుకు రావటం లేదు? ర్యాంకులకు అవసరమైన సామాగ్రిని (వివరాల్ని) పక్కాగా అందించటం లాంటి జిమ్మిక్కులు బాబుకు అలవాటేనని.. ఆ నైపుణ్యంతోనే నెంబర్ వన్ ర్యాంకు వచ్చిందన్న విమర్శ లేకపోలేదు. దీనికి ఉదాహరణగా రాజధాని అమరావతి ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు.
రానున్న రోజుల్లో అమరావతి ఎలా ఉంటుందో తెలుసా? అంటూ గ్రాఫిక్స్ తో ఊరించే చంద్రబాబు కలల ప్రపంచంలోకి తీసుకెళతారు. కానీ.. అందులో చూపించినవన్నీ జరగటానికి ఎన్నేళ్లు పడుతుందన్న విషయాన్ని.. ఎంత ఖర్చు అవుతుందన్న మాటను చెప్పరు. కానీ.. అసలు విషయమంతా ఆ ప్రశ్నల్లోనే ఉందన్నది మర్చిపోకూడదు. ఇదే రీతిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలోనూ ఏపీలో పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. ఏ చిన్న అవకాశం లభించినా తనకు అనుకూలమైన మీడియా సంస్థలకు భారీ ఎత్తున ప్రకటనల్ని ఇచ్చేసే పెద్ద మనసు బాబు సొంతంగా చెబుతారు. దీనికి తగ్గట్లే ఎంపిక చేసిన మీడియా సంస్థలకు భారీ ఎత్తున జాకెట్ యాడ్స్ ఇచ్చేయటం గమనార్హం.