Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడుకు వయసుకు తగ్గ ఆహ్వానాలా!

By:  Tupaki Desk   |   2 Sept 2019 11:03 AM IST
చంద్రబాబు నాయుడుకు వయసుకు తగ్గ ఆహ్వానాలా!
X
మొన్నటి వరకూ చంద్రబాబు నాయుడు ఆర్థిక సదస్సులు అంటూ తిరిగే వారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దావోస్ కు తరచూ తన విమానాన్ని తిప్పారు. అప్పుడు ప్రభుత్వ ధనంతో - ప్రజల డబ్బుతో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు నాయుడు టికెట్లను కొనుక్కొన్నారు. ఆ సదస్సుకు వెళ్లాలంటే డబ్బులు పెట్టాలని - అలా చంద్రబాబు నాయుడు హాజరయినట్టుగా తెలుస్తోంది.

అదేమంటే చంద్రబాబు నాయుడు ప్రపంచ మేధావి అని అందుకే అలాంటి ఆర్థిక సదస్సులకు ఆహ్వానాలు దక్కాయని టీడీపీ వాళ్లు ప్రచారం చేశారు. అయితే అసలు గుట్లు ఎప్పటికప్పుడు బయటపడిపోతూ చంద్రబాబు పరువు తీశాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఉచితంగానే ఒక ఆహ్వానం దక్కింది. అదే ప్రపంచ శాంతి సదస్సుకు!

రాజస్థాన్ లోని మౌంట్ అబూలో ఆ సదస్సు జరగబోతోంది. ఈ నెలాఖరు నుంచి నాలుగు రోజుల పాటు అది సాగుతుందట. బ్రహ్మకుమారీలు ఆ సదస్సును నిర్వహించబోతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానం దక్కిందట.

బ్రహ్మకుమారీలు దాదాపుగా సర్వపరిత్యాగులు. చంద్రబాబు నాయుడు అయితే అలాంటి పరిత్యాగి కాదు. అయితే ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా దాదాపు ఖాళీ. అందులోనూ చంద్రబాబుది ఆధ్యాత్మిక చింతన - ప్రవచనాల వయసు. దానికి తగ్గట్టుగా ఆహ్వానం దక్కినట్టుగా ఉంది. మరి ఆ కార్యక్రమానికి ఆయన హాజరు కాబోతున్నారా?