Begin typing your search above and press return to search.
రెండు 'దేశా' ల మధ్య పొత్తు చిచ్చు...
By: Tupaki Desk | 26 Aug 2018 11:59 AM ISTతెలుగుదేశం పార్టీలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ నాయకుల మధ్య పొత్తు అంశం వివాదంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయాలనుకుంటున్న చంద్రబాబు నాయుడి ఆలోచనను ఒకరు స్వాగతిస్తే మరొకరు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుతో లాభపడి అధికారంలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆశిస్తున్నారు. దీనికి విరుద్దంగా కాంగ్రెస్‌తో పొత్తేంటంటూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకులు - మంత్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల తెలుగు తమ్మళ్ల మధ్య వైరం రాజుకుంటోంది. తెలుగదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగానని వారితో కలవడం ఆత్మహత్యా సదృశ్యమేనని ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఎవరితో కలసి పనిచేసినా మంచిదేనని తెలంగాణ తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ తో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు - కె.ఈ. క్రిష్ణమూర్తి నిరసన గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ తో పొత్తు ఖాయమైతే ప్రజలు నడిరోడ్డులో నిలబెట్టి తంతారు అని పరుషంగా మాట్లాడారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త కటువుగానే స్పందించారు. ఈ మాటలేమిటి అంటూ మంత్రుల ఇద్దరిపై ఫైర్ అయ్యారు. వారిని పిలిపించి మందలించమంటూ ఆంధ్రప్రదేశ్ తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును ఆదేశించారు.
మరోవైపు మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణలో పార్టీ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రుల మాటల ప్రభావం తెలంగాణలో ఉన్న సెటిలర్లపై పడుతుందని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. పార్టీ ప్రయోజనాలను రాజకీయ వ్యూహాలను అనుసరించి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటారని అవేమి పట్టించుకోకుండా మంత్రులు ప్రకటనలు చేయడం తగదని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తోందని ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీకి ఉపయోగపడుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వాదన. ఇవేవి ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఇష్టారీతిలో ఏపీ మంత్రులు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తో పొత్తు అంశం అటుఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోనూ కూడా ప్రకంపనలు స్రుష్టిస్తోంది.