Begin typing your search above and press return to search.

పల్లెకు ఫుల్లుగా చంద్రబాబు చీవాట్లు

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:57 AM GMT
పల్లెకు ఫుల్లుగా చంద్రబాబు చీవాట్లు
X
ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్లుగా క్లాసు పీకారట. మంత్రి పదవి చేపట్టి 18 నెలలైనా కూడా ఇంతవరకు ఏపీకి ఒక్క సంస్తను కూడా తేలేకపోయారంటూ ఆయనకు గట్టిగా వార్నింగు ఇచ్చారట. బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే... ఆ సమావేశంలో సీఎం రాష్ట్రంలోని ప్రధానాంశాలపై చర్చించడమే కాకుండా వెనుకబడి ఉన్న మంత్రులను ఒక రేంజిలో దులిపేసినట్లు చెబుతున్నారు. అలా చంద్రబాబుతో చీవాట్లు తిన్నవారిలో పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు.

వాస్తవానికి పల్లె రఘునాథరెడ్డి చేతిలో ఉన్న ఏ శాఖల్లోనూ స్పీడు లేదు. ఆయన చేతిలో సమాచార ప్రసార శాఖ ఉన్నప్పటికీ ఆ శాఖపై పరకాల ప్రభాకర్ ఆధిపత్యం కొంత కనిపిస్తోంది. అలాగే ఐటీ శాఖను తీసుకుంటే ఐటీరంగానికి సంబంధించి ఏమాత్రం డెవలప్ మెంట్ కనిపించడం లేదు. ఐటీ అంటే చంద్రబాబు... చంద్రబాబు అంటే ఐటీ.. కానీ, పల్లె రఘునాథరెడ్డి చేతిలో పడిన ఆ శాఖ చంద్రబాబు పరువు తీస్తోంది. కొత్త రాష్ట్రంలో కనీసం సరైన ప్రాజెక్టు ఒక్కటి కూడా రాలేదు. అదేసమయంలో తెలంగాణలో ఐటీ మహా స్పీడుగా ఉంది. ఆ శాఖ చూస్తున్న కేటీఆర్ సాఫ్టువేర్ రంగాన్ని మరింత విస్తరించడంలో శాయశక్తులా పనిచేస్తూ ఫలితం సాధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా ఆ సంస్థ ఓకే అంది. ఏపీ మాత్రం ఐటీలో దిక్కులు చూస్తోంది. ఇవన్నీ చూస్తూ చంద్రబాబు ఇక ఆగలేక పల్లె రఘునాథరెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. శాఖపై పట్టు పెంచుకుని ఇకనైనా కాస్త పనిచేయమని స్ట్రాంగుగానే చెప్పారట. దీంతో పల్లె రఘునాథరెడ్డి మొహం కందగడ్డలా మారిపోయిందట. నిత్యం ఫుల్లుగా పౌడర్ రాసుకుని కనిపించే మంత్రిగారి మొహం ఎర్రబారిపోవడం స్పష్టంగా కనిపించిందని మిగతా మంత్రులు చెప్తున్నారు.