Begin typing your search above and press return to search.

బాబుకు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుందా?

By:  Tupaki Desk   |   10 Jun 2019 1:59 PM IST
బాబుకు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుందా?
X
ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి ఒక రాష్ట్రానికి వెళ్లిన‌ప్పుడు.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌టం.. సాద‌రంగా ఆహ్వానించ‌టం.. కాస్తంత భేటీ కావ‌టం లాంటివి చాలా కామ‌న్ అంశాలు. అందుకు భిన్నంగా తాజాగా తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీతో.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏకాంతంగా భేటీ కావ‌టం ఇప్పుడు చ‌ర్చ‌గా మార‌ట‌మే కాదు.. బాబుకు కొత్త భ‌యాన్ని తెచ్చి పెట్టింద‌ని చెప్పాలి.

ఒక‌ప్పుడు త‌న మిత్రుడైన మోడీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని షురూ చేయ‌టం.. దానికి తోడు మోడీని ఉద్దేశించి ఘాటు విమ‌ర్శ‌ల‌తో పాటు.. దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఆయ‌న‌కు పోటీగా కూట‌మి క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. కూట‌మి స్నేహితులను ఒక చోట చేర్చే ప్ర‌య‌త్నం చేశారు. దేన్నైనా వ‌దిలేస్తారు కానీ.. త‌న విష‌యాన్ని ఎవ‌రు ట‌చ్ చేసినా సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యే మోడీ.. తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో త‌న ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుపై దృష్టి సారించారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

అందుకు త‌గ్గ‌ట్లే.. బ‌య‌ట‌కు వ‌స్తున్న వార్త‌లు బాబు బ్యాచ్ కు గుండెలు అదిరేలా చేస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో బాబు త‌న ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి పెద్ద పీట వేశార‌ని.. దీనికి సంబంధించిన ప‌లు వివ‌రాలు ఇప్ప‌టికే వెళ్లాల్సిన చోటుకు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బాబుపై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల మీద జ‌గ‌న్ కు మోడీ ఏదైనా డైరెక్ష‌న్ ఇచ్చారా? అన్న‌ది చ‌ర్చ‌గా మారింది. అయితే.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అలాంటిదేమీ లేద‌ని.. కాకుంటే ఆ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టికి ఇప్ప‌టికే కొన్ని ఉదంతాలు వ‌చ్చాయ‌ని.. వాటిని అధికారులు లోతుగా ప‌రిశీలిస్తున్నార‌ని.. ఏదో బుర‌ద జ‌ల్లిన‌ట్లు కాకుండా.. రూల్స్ ను ఎక్క‌డైతే పాటించ‌లేదో.. వాటి అంశాల‌తో బాబును బుక్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అదే ప‌నిగా క‌ల‌వాటుకు గురి అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. బాబుకు బ్యాండ్ వేసే విష‌యంలో అంతో ఇంతో క‌ద‌లిక మొద‌లైన‌ట్లేన‌ని తెలుస్తోంది. అదే బాబుకు నిద్ర‌ల్లేని రాత్రుల్ని మిగులుస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.