Begin typing your search above and press return to search.

బాబు ఫ్యామిలీకి భాగ్య‌న‌గ‌రంలో లింక్ తెగింది

By:  Tupaki Desk   |   14 March 2018 5:41 AM GMT
బాబు ఫ్యామిలీకి భాగ్య‌న‌గ‌రంలో లింక్ తెగింది
X
ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఆ రాష్ట్రంలో ఓటు లేకుండా ఉంటుందా? అంటే.. ఉంద‌ని చెబుతారు చాలామంది. కానీ.. అది త‌ప్పు అని రుజువు చేశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ బాబు ఓటు తెలంగాణ‌లో ఉంటే.. ఆయ‌న ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఎన్నిక‌ల త‌ర్వాతే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల త‌ర్వాతేం జ‌రుగుతుందన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఏపీలో రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాల‌నుకున్న బాబు.. త‌న ఓటును మాత్రం అక్క‌డ ఉంచుకోవాల‌న్న ఆలోచ‌న చేయ‌లేదు.

ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న త‌న ఓటును మార్చేసుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి నాలుగేళ్లు అవుతున్నా.. ఆయ‌న ఫ్యామిలీ మొత్తం (బాబు.. లోకేశ్ మిన‌హా) మిగిలిన వారంతా హైద‌రాబాద్‌లోనే ఉంటున్న ప‌రిస్థితి. బిజినెస్ అంటూ మాట‌లు చెబుతున్నా.. వాటిని ఏపీకి మార్చుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడే బాబు.. త‌న వ్యాపారాల‌న్ని ఏపీ నుంచి నిర్వ‌హించాల‌ని మాత్రం అనుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. మొన్న‌టి వ‌ర‌కూ బాబు స‌తీమ‌ణి.. బాబు కోడ‌లి ఓట్లు హైద‌రాబాద్ లోనే ఉన్నాయి. ఎన్నిక‌లు ఏడాదికి వ‌చ్చేయ‌టంతో పాటు.. ఏపీ సీఎం ఫ్యామిలీ ఓట్లు ఉండేది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అన్న విమ‌ర్శ‌కు చెక్ చెప్పేందుకు త‌మ కుటుంబ స‌భ్యుల ఓట్ల‌ను ఏపీకి షిఫ్ట్ చేసేశారు.

తాజాగా బాబు కుటుంబ స‌భ్యులంద‌రి ఓట్లు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లికి మారిపోయాయి. చంద్ర‌బాబు కుటుంబ స‌భ్య‌లు ఉండ‌వ‌ల్లి గ్రామ‌పంచాయితీలో త‌మ ఓట్ల‌ను న‌మోదు చేసుకున్నారు. బాబు.. లోకేశ్‌.. భువ‌నేశ్వ‌రి.. బ్రాహ్మ‌ణి ఇంటి నంబ‌రు 3-781/1 గా ఓట‌ర్ల జాబితాలో పేర్కొన్నారు. ఏపీ ఓట‌ర్ల లిస్టులో బాబు ఫ్యామిలీ స‌భ్యుల ఓట్లు మొత్తం న‌మోదైన నేప‌థ్యంలో సాంకేతికంగా హైద‌రాబాద్ తో వారి లింకు తెగిపోయిన‌ట్లేన‌ని చెప్పాలి. ఓటు ఉన్న చోటే ఓట‌రు నివ‌సిస్తున్న‌ట్లు పేర్కొన్న నేప‌థ్యంలో బాబు కుటుంబ స‌భ్యులు ఇక‌పై హైద‌రాబాదీయులు కాన‌ట్లే.