Begin typing your search above and press return to search.
కొత్త సమస్య రెడీ అవుతోంది బాబు
By: Tupaki Desk | 15 Sept 2016 7:07 PM ISTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ టైం ప్రారంభమయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారపక్షానికి వ్యతిరేకత ఎదురుకావడంలో కొత్త ఏమీ లేనప్పటికీ...నవ్యాంధ్రప్రదేశ్ లో రెండున్నరేళ్ల కాలంలోనే అధికార పక్షానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయనేది తాజా హాట్ టాపిక్. అంతేకాకుండా ఎవరి పాలనా కాలంలోనైనా ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు ఏకం కావడం - పోరాటాలు చేయడం పరిపాటి. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రతిపక్షాలమధ్య ఐక్యతకు బీజం వేసిందని చెప్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్రం సంకేతాలు ఇవ్వడమే కాకుండా దాదాపుగా ప్యాకేజీతోనే సరిపెట్టడంతో ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనను వ్యక్తంచేస్తున్నాయి. అయితే వేర్వేరుగా చేపట్టే బదులుగా ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల ప్రత్యేకహోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసన పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ తోపాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ఏపీ బంద్ రూపంలో ఇది ప్రారంభం కాగా త్వరలో ఇది మరింత జోరు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకహోదా సాధ్యంకాదు - ఇవ్వలేమని కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పష్టంగా పేర్కొని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాక పెరిగిన ప్రతిపక్షాల పోరుతో తమ పార్టీ ఇరకాట స్థితిని ఎదుర్కోంటోందని టీడీపీ సీనియర్ నేతలు విశ్లేషించడం ఇందుకు ఉదాహరణ. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తొలుత ఏపీ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించడంతో అదే బాటన రాష్ట్రం లోని అన్ని పక్షాలు పయనిస్తున్నాయి. ఈ విషయంలో కాస్త ఆలస్యమైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచుతోంది. దీంతో ఏ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం గానీ దీక్షలు - నిరసనలు వ్యక్తంచేస్తున్నా అనివార్యంగా అన్ని ప్రతిపక్షాలు వాటిని మద్దతు తెలుపుతున్నాయి.
గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు అన్ని వర్గాలు - అన్ని పార్టీలు తమ మద్దతును తెలిపాయి. నాడు జగన్ దీక్షా శిభిరానికి సిపిఐ - సిపిఎం పార్టీల నేతలు పరామర్శించి తమ మద్దతును ప్రకటించాయి. ఇలా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలోని టీడీపీ - కేంద్రంలోని బీజేపీ పార్టీలను అన్ని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. పార్టీలు తమ సిద్దాంతాలను పక్కనెట్టి అధికార పక్షాలపై విరుచుకుపడుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఐక్యత మున్ముందు అధికార పార్టీలకు శాపంగా మారుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ ఎన్నికల సమయంలో ఏకమైన వేళ రాష్ట్ర సర్కార్లు మారిన పరిస్థితులు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యే దాక ఇప్పుడున్న ఐక్యతను ఎన్నికల నాడు కూడా ప్రతిపక్షాలు ప్రదర్శిస్తాయా అన్న చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే సందర్బంలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బలం వామపక్ష పార్టీలకు ఉంది. వామపక్ష పార్టీల మద్దతు జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి అందుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య ఐక్యత మున్ముందు కూడా ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల విశ్లేషణ. ఏపీ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న కార్పోరేషన్ - మున్సిపల్ ఎన్నికల్లో అధికార టిడిపిని ఎదుర్కోనేందుకు వామపక్షా పార్టీలతో పొత్తుపెట్టుకొని ముందుకెళ్లాలని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.ఈ ఐక్యత ఇలాగే కొనసాగితే పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంటుందని టీడీపీ-బీజేపీ వర్గాలు కూడా తమ అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి.