Begin typing your search above and press return to search.

చంద్రబాబు పరాజయం పసిగట్టారా..!?

By:  Tupaki Desk   |   22 July 2018 10:55 AM GMT
చంద్రబాబు పరాజయం పసిగట్టారా..!?
X
" దేశంలో అందరి కంటే నేను సీనియర్ నాయకుడ్ని. నా తర్వాతఅందరూ ముఖ్యమంత్రులయ్యారు " " నా మీద కేంద్రం కుట్రలు చేస్తోంది. నాకు ఏదైనా జరిగితే మీరే కాపాడాలి " " అలిపిరి వంటి హత్యాయత్నం చేసే అవకాశాలున్నాయి" ఈ మాటలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివే. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన భయాన్ని బయటపెడుతున్నాయి. కేంద్రం లోక్‌ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇందులో భాగంగా తనపై కేంద్రంలో కుట్రలు జరుగుతున్నాయని - తనను శారీరికంగా కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేనిపోని భయాలను వెళ్లగక్కుతున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడి లోలోపలి భయాన్ని తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులతో పాటు మానసిన వైద్యులు కూడా నిర్దారిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రెండు పర్యాయాలు ము‍‌ఖ్యమంత్రిగా చేసిన సమయంలో కూడా ఇంతటి భయాన్ని - ఆందోళనని ఎన్నాడూ వెల్లడించలేదు. అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరి ఏడాది మాత్రం చాల వింతగా ప్రవర్తించేవారు. అలాగే తానే ఎక్కవగా టివీలలోనూ - పత్రికలలోనూ ఎక్కువ కనిపించేలా ప్రవర్తించేవారు. ఇది ఆయనకు కలసోస్తుందని అప్పట్లో చంద్రబాబు నాయుడు భావించేవారు. " టివీలలోనూ - పత్రికలలోనూ - ప్రతి సమావేశంలోను చంద్రబాబు నాయుడే కనిస్తున్నారంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్టుంది." అని స్వర్గస్తులైన సీనియర్ సంపాదకుడు - మహా రచయిత అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్లుగానే ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంగా చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వ్యాఖ‌్యానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రవర్తన ఆనాటి ప్రవర్తనకు సరిపోలుతోంది. ఆనాడు వ్యక్తం చేసిన భయాలనే నేడు మరో రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రవర్తనతో చంద్రబాబు నాయుడు తన పరాజయాన్ని పసిగట్టారా అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.