Begin typing your search above and press return to search.

బాబు ఖ‌ర్చు క‌నిపిస్తాయ్..మోడీ ఖ‌ర్చు క‌న‌ప‌డ‌దే!

By:  Tupaki Desk   |   19 May 2019 10:41 AM IST
బాబు ఖ‌ర్చు క‌నిపిస్తాయ్..మోడీ ఖ‌ర్చు క‌న‌ప‌డ‌దే!
X
కీల‌క స్థానాల్లో ఉన్న వారి ఖ‌ర్చుల్ని అదే ప‌నిగా లెక్క పెట్టాల‌నుకోవ‌టం అంత మంచి తీరు కాదు. కానీ.. శ్రుతి మించిన‌ట్లుగా ఉండే ఖ‌ర్చుల లెక్క అధినేత‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌నుకోవ‌టం త‌ప్పేం కాదు.విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలాంటివేళ ఆచితూచి అన్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్న వారు ఖ‌ర్చు చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. ఖ‌ర్చు విష‌యంలో మిగిలిన వ్య‌వ‌స్థ మొత్తం ఆయ‌న్నే ఫాలో అవుతుంది.

అలాంటిది..చేతికి ఎముక లేన‌ట్లు ఖ‌ర్చు చేయ‌టం.. డ‌బ్బులు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అప్పు చేసే అల‌వాటు చేస్తే.. అంద‌రిలోనూ అలాంటి ధోర‌ణే పెరుగుతుంది. అందుకే..పాలించే రాజు చేసే వ్య‌క్తిగ‌త ఖ‌ర్చు చూస్తే.. ఆయ‌న తీరు ఎలా ఉంటుందన్న‌ది అర్థ‌మ‌వుతుంది. నేత‌ల ఖ‌ర్చు మాట చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌లువురు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఫైవ్ స్టార్ హోట‌ల్లో బ‌స‌.. అదే ప‌నిగా స్పెష‌ల్ ఫ్లైట్స్ తో పాటు.. అనవ‌స‌ర ఖ‌ర్చులు భారీగా క‌నిపిస్తుంటాయి. ప్ర‌చారం కోసం పెట్టే ఖ‌ర్చు గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం పుణ్య‌మా అని బాబు చేసే అన‌వ‌స‌ర ఖ‌ర్చు ఎంత భారీగా ఉంటుంద‌న్న విష‌యం త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తుంటుంది. విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. ఏపీలో బాబు మాదిరే ప్ర‌ధాని మోడీ ఖ‌ర్చు సైతం భారీగా ఉంటుందంటారు. పేరుకు ఒంట‌రి అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఖ‌ర్చుల లెక్క‌లు భారీగా ఉంటాయంటారు.

కాకుంటే.. ఆయ‌న ఖ‌ర్చు లెక్క బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌టం.. మోడీ తీరును గ‌ట్టిగా ప్ర‌శ్నించే వారు క‌నిపించ‌ర‌ని చెప్పాలి. ఎక్క‌డిదాకానో ఎందుకు? కేదార్ నాథ్ టెంపుల్ ను ద‌ర్శించుకునేందుకు.. అక్క‌డికి ద‌గ్గ‌ర్లోకి గుహ‌లో ఏకాంత ధ్యానం చేసేందుకు మోడీ మ‌క్కువ చూప‌టం ఓకే. కానీ.. ఇదంతా ప్ర‌జాసొమ్ముతోనే జ‌రుగుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డిచిన రెండేళ్ల‌లో నాలుగుసార్లు కేదార్ నాథ్ కు మోడీ వెళ్ల‌టం దేనికి నిద‌ర్శ‌నం? ఒక దేశ ప్ర‌ధాని కేదార్ నాథ్ లాంటి క్లిష్ట‌మైన ప్రాంతానికి వెళితే.. ఎంత భారీగా ఖ‌ర్చు అవుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. మ‌రి.. ఇలాంటి లెక్క‌లు ఎవ‌రో ఒక‌రు తీసి పుణ్యం క‌ట్టుకోవ‌చ్చుగా?