Begin typing your search above and press return to search.

అమిత్ షా కాదు.. అత‌నో అబ‌ద్ధాల షా!

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:21 AM GMT
అమిత్ షా కాదు.. అత‌నో అబ‌ద్ధాల షా!
X
ఏపీకి ఇచ్చిందేమైనా ఉందా? గుప్పెడు మ‌ట్టి.. గ్లాసుడు నీళ్లు త‌ప్ప అంటూ విరుచుకుప‌డుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు త‌గ్గ‌ట్లే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మ‌రింత‌గా చెల‌రేగిపోతూ.. ఏపీకి మేం చెప్పిన‌వ‌న్ని చేసేశాం. ఇచ్చిన హామీల్ని తీర్చేశామంటూ మ‌రింత బ‌లంగా.. బ‌ల్ల‌గుద్దిన‌ట్లుగా వాదించ‌టం చేస్తుంటారు.

ఏ మాట‌కు ఆ మాటే..ఏమీ చేయ‌కుండానే చాలా చేసిన‌ట్లుగా చెప్పుకోవ‌టంలో మోడీషాల త‌ర్వాతే ఎవ‌రైనా. ఏపీకి సంబంధించిన ఏదేదో చేశామ‌ని చెప్పే మోడీషాలు.. విభ‌జ‌న చ‌ట్టంలో కీల‌క‌మైన రైల్వే జోన్.. పోల‌వ‌రం సంబంధించి నాలుగున్న‌రేళ్ల‌లో చేసిందేమిట‌న్న దానిపై సూటిగా స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

అయిన‌ప్ప‌టికీ 90 శాతం హామీల్ని నెర‌వేర్చామ‌ని చెప్పే షా తీరుపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఏపీకి బీజేపీ స‌ర్కారు ఏమీ చేసింది లేదంటూ నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు.. ఆయ‌న అమిత్ షా కాదు అబ‌ద్ధాల షా అంటూ మండిప‌డ్డారు. అంతేకాదు.. అమిత్ షా తీరును త‌ప్పు ప‌డుతూ ఆయ‌న ఫైర్ అయ్యారు. బాబు చేసిన ఘాటు విమ‌ర్శ‌ల్ని చూస్తే..

+ బీజేపీ చీఫ్‌ అమిత్‌ సా నిన్న రాష్ట్రానికి వచ్చి అవాకులు చవాకులు పేలారు. గత అయిదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేదు.

+ 90 శాతం చేసేసినట్లు అమిత్‌ షా పచ్చి అబద్ధాలు చెప్పారు. అమిత్‌ షా కాదు అతనో అబద్ధాల షా. 2014కంటే ముందు అమిత్ షా ఎక్కడ ఉన్నారు..?

+ మ‌రింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం బీజేపీ నేతల్లో ఏమాత్రం లేదు.

+ ఇంకా రెచ్చగొడుతున్నారు, బాధపెడుతున్నారు. రెచ‍్చగొట్టి, బాధపెట్టి బీజేపీ నేతలు ఆనందం పొందుతున్నారు.

+ గ‌తంలో పనులు చేసి.. ప్రజల్ని మెప్పించేలా రాజకీయాలు చేస్తే.. బీజేపీ రెచ్చగొట్టి ...బాధపెట్టే రాజ‌కీయాల్ని తెచ్చింది.

+ అమిత్‌ షా వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరగాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా?. విశాఖపట్నానికి రైల్వేజోన్‌ ఇచ్చారా?. కడపలో స్టీల్‌ ఫ్లాంట్‌కు నిధులు ఇచ్చారా?. కాకినాడలో పెట్రో కాంప్లెక్స్‌ పెట్టారా?. ఏం చేశారని 90శాతం లెక్క చెబుతున్నారు.

+ ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. రాష్ట్రంపై నరేంద్ర మోదీ, అమిత్‌ షా కక్ష కట్టారు. పగ, ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు.

+ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది కూడా ఆంధ్రప్రదేశ్‌ పై అసూయ - ద్వేషం ప్రదర్శిస్తున్నారు. ప్రధాని - కేసీఆర్‌ ప్రతిపక్ష నేతకు సహకరిస్తున్నారు.

+ ఉగ్రదాడులపై గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు మోదీ వ్యాఖ్యలనే ప్రస్తావించాం. మోదీ అప్పట్లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పై ఏం మాట్లాడారు?. మోదీ అప్పటి మాటలనే నేను మళ్లీ గుర్తు చేశా. దానిపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేయడం అనవసరం.

+ టీడీపీ చేసింది మోసం కాదు, బీజేపీ చేసింది నమ్మకద్రోహం. మోసాలు, కుట్రలు చేస్తోంది బీజేపీనే. దేశానికి ఎవరు ద్రోహులో?.. ఎవరు రాజకీయాలకు వాడుకుంటున్నారో ప్రజలే తేలుస్తారు.

+ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి జాతీయ స్థాయిలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తాం. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు.