Begin typing your search above and press return to search.
గుమ్మడికాయ దొంగ సామెతను గుర్తు చేసేలా బాబు తీరు?
By: Tupaki Desk | 7 Aug 2019 5:40 PM ISTనిజాలు నోటి వెంట వస్తుంటే.. వినే వారికి చిరాకు వచ్చేస్తుంటుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉంది. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు విషయాలు మాట్లాడారు. బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ఏపీ సీఎం జగన్ కోసం 45 నిమిషాల సమయాన్ని కేటాయించారు మోడీ. ఈ సందర్భంగా ఏపీకి అవసరమైన నిధుల విషయాలతో పాటు.. మరిన్ని అంశాల్ని ఆయన ముందు పెట్టారు. భారీ వినతి పత్రాన్ని అందించటంతో పాటు.. మోడీకి చిరాకు అన్న విషయం తెలిసి కూడా ఏపీకి ప్రత్యేక హోదా అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు జగన్.
ఇదిలా ఉంటే.. మోడీ-జగన్ భేటీపై టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చేస్తుంది. వారి భేటీపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఎందుకంటే.. మోడీని కలిసినప్పుడు నిధులు అడగటం మానేసి తనపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా వాపోయారు. తాను మొదలెట్టిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ అసలే నిక్కచ్చి మనిషి. అంతకు మించిన లెక్క మనిషి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటానికి ముందు.. అంతకు ముందు విడుదల చేసిన నిధుల లెక్క.. వాటి ఖర్చు చేసిన తీరు గురించి వివరాలు చెప్పకుంటే పైసా రాల్చటానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తి దగ్గర బాబు ఐదేళ్ల పాలనలో చేసిన ఆరాచకాలు మొత్తంగా కాకున్నా.. శాంపిల్ గా అయినా చెప్పాలి కదా? లేకుంటే.. ఆయన గతంలో విడుదల చేసిన నిధులకు కొర్రీలు వేస్తూ ఉంటే.. ఏపీలో డెవలప్ మెంట్ పరిస్థితి ఏమిటి? అయినా.. నిజాలు చెప్పేస్తుంటే బాబుకు ఎందుకంటే ఇరిటేషన్. తప్పు చేయకుంటే.. ఎవరెన్ని చెప్పినా ఏమీ కాదు కదా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా బాబు మాటలు అనిపించట్లేదు?