Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి హైకోర్టు!..బాబుకు సంతోష‌మా? బాధా?

By:  Tupaki Desk   |   28 Dec 2018 8:45 AM GMT
అమ‌రావ‌తికి హైకోర్టు!..బాబుకు సంతోష‌మా? బాధా?
X
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాదును పేర్కొన్న విభ‌జ‌న చ‌ట్టం... ఉమ్మ‌డి రాజ‌ధాని కాల ప‌రిమితిని ప‌దేళ్లుగా పేర్కొంది. అయితే ఓటుకు నోటు కేసు ద‌రిమిలా... ప‌దేళ్ల పాటు హైద‌రాబాదు నుంచే ఏపీ పాల‌న కొన‌సాగించే వీలున్నా... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... అప్ప‌టిక‌ప్పుడు హుటాహుటీన‌ - హ‌డావిడిగా విజ‌య‌వాడ‌కు ప‌రుగులు పెట్టారు. హైద‌రాబాదులో ఉంటే ఎక్క‌డ అరెస్ట్ అవుతానోన‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు... విజ‌య‌వాడ‌కు ప‌రుగులు తీశార‌ని నాడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా... త‌న క్షేమాన్ని మాత్ర‌మే దృష్టిలో పెట్టుకున్న బాబు... ఎవ‌రేమ‌న్నా కూడా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. రాజ‌ధానితో పాటు రోజుల వ్య‌వ‌ధిలో ఉద్యోగుల‌నంతా అమ‌రావ‌తికి త‌ర‌లించేసిన చంద్ర‌బాబు... అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా రూపొందిస్తామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకున్నారు.

అంతేకాకుండా హైద‌రాబాదు కేంద్రంగానే కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఉమ్మ‌డి హైకోర్టును విభ‌జించాల్సిందేన‌ని - ఏపీ హైకోర్టును అమ‌రావ‌తికి మార్చాల్సిందేన‌ని కూడా చంద్ర‌బాబు కేంద్రంతో పోరాడిన‌ట్లుగా కూడా టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాసిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. పాల‌న అమ‌రావ‌తి నుంచి సాగిస్తున్న త‌మ ప్ర‌భుత్వానికి... హైద‌రాబాదులో హైకోర్టు ఉండ‌టం ఇబ్బందిగా మారింద‌న్న కోణంలోనూ పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాయించేశారు. ఈ క్ర‌మంలో మొన్న హైకోర్టును రెండుగా విభ‌జిస్తూ నోటిఫికేష‌న్ జారీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం... ఏపీ హైకోర్టును అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. అంటే బాబు అండ్ బ్యాచ్ కోరిన‌ట్లుగానే హైకోర్టును విభ‌జించిన కేంద్రం... అమ‌రావ‌తిలో ఏపీ హైకోర్టుకు మార్గం సుగ‌మం చేసింది. ఈ వార్త తెలిసిన వెంట‌నే బాబు అనుకూల మీడియా కూడా దాదాపుగా సంబ‌రాలు చేసుకున్నంత ప‌ని చేసింది. అయితే అందుకు విరుద్ధంగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కాసేప‌టి క్రితం అమరావ‌తి కేంద్రంగా ఆరో శ్వేత ప‌త్రాన్ని విడుద‌ల చేసిన సంద‌ర్భంగా హైకోర్టు విభ‌జ‌న‌ - కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరుపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు.

అంత హ‌డావిడిగా హైకోర్టును విభ‌జించాల్సిన ప‌నేముంద‌న్న కోణంలో మాట్లాడిన చంద్ర‌బాబు... హైకోర్టు విభ‌జ‌న‌ను హ‌డావిడిగా ముగించిన కేంద్రం పెద్ద త‌ప్పు చేసింద‌ని వాపోయారు. హైకోర్టు విభ‌జ‌న‌పై త‌మ‌కు క‌నీస స‌మాచారం కూడా ఇవ్వ‌లేద‌ని కూడా ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై నిందారోప‌ణ‌లు చేశారు. అంతేకాకుండా కేవ‌లం ఐదో రోజుల వ్య‌వ‌ధిలో ఏపీ హైకోర్టుకు సంబంధించిన యంత్రాంగం మొత్తం అమ‌రావ‌తికి త‌ర‌లిపోయేలా కేంద్రం ఆదేశాలు జారీ చేసింద‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగుల త‌ర‌లింపు అన్న విష‌యం పెద్ద తంతుగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌... ఉద్యోగుల త‌ర‌లింపున‌కు క‌నీసం నెల రోజుల వ్య‌వ‌ధి కూడా ఇవ్వ‌లేద‌ని త‌న‌దైన రీతిలో శోకాలు తీశారు. హైకోర్టు విభ‌జ‌న‌పై తాత్సారం చేస్తారేమిట‌ని ఇదే నోటీతో ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు... ఇప్పుడేమో హ‌డావిడిగా హైకోర్టు విభ‌జ‌న త‌ప్ప‌ని కూడా చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. తాత‌ను కోరిన‌ట్లుగానే హైకోర్టు విభ‌జ‌న జ‌రిగినా... బాబులో ఆనందం స్థానంలో బాధ ఎందుకు క‌లుగుతుంద‌న్న విష‌యం ఇప్పుడు ఏ ఒక్కరికి అర్థం కావ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా హైకోర్టు విభ‌జ‌నపై చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారా? లేదా బాధ ప‌డుతున్నారా? అన్న విష‌యంపై ఇప్పుడు పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.