Begin typing your search above and press return to search.
అమెరికా వీధుల్లో... చిల్ బాబు చిల్!!
By: Tupaki Desk | 2 Aug 2019 10:17 PM ISTచంద్రబాబు... తనకు తాను రోజుకు 18 గంటలు కష్టపడతాను అని చెప్పుకోవడానికి సంతోష పడతారు. హైటెక్ బాబు మాత్రమే కాదు హార్డ్ వర్క్ బాబు అని ఆయన అనుయాయులు ప్రచారం చేస్తుంటారు. మనిషి మనిషికి వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. చంద్రబాబు స్మార్ట్ వర్క్ కంటే హార్డ్ వర్క్ ను ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. చిన్న చిన్న విషయాలపై కూడా సుదీర్ఘ సమీక్షలు చేస్తుంటారు. మొత్తాని మొన్నటి ఎన్నికల తర్వాత బాబుకు చేతిలో పవరే కాదు, పని కూడా లేకుండా అయిపోయింది. వచ్చిన సీట్లు తక్కువ కావడంతో పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా ఏం ఉండటం లేదు. కలిసే నేతలు కూడా పెద్దగా లేరు. జాతీయ స్థాయి మీటింగులు లేవు. దీంతో విపరీతమైన ఖాళీ టైం దొరుకుతోంది బాబుకు. అయితే, ఇక్కడున్నపుడు ఆ విషయం తెలియలేదు గాని... నాల్రోజుల అమెరికా పర్యటనలో స్పస్టంగా కనిపించింది.
తూర్పు అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో రాచెష్టర్ నగరంలోని మేయో క్లినిక్ లో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవి పెద్దగా టైం తీసుకోలేదు. ఈ టూర్లో ఆయనతో పాటు నారా భువనేశ్వరి మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఉన్నపుడు ఆమె హెరిటేజ్ వ్యవహారాలు - కుటుంబంతో బిజీగా ఉంటే... చంద్రబాబు పార్టీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఎపుడో అరుదుగా తప్ప పెద్దగా కుటుంబంతో గడపరు. చాలాకాలానికి భార్యతో కబుర్లు చెప్పుకోవడానికి చంద్రబాబుకు కావల్సినంత సమయం దొరికింది. ఎపుడూ కనిపించని విధంగా ఏ ఆలోచనలు లేకుండా సరదాగా పాప్ కార్న్ తింటూ అలా అమెరికా వీధుల్లో తిరుగుతూ చంద్రబాబు టైంపాస్ చేశారు. బాబు కలవడానికి ఫ్రీగా దొరకడంతో తానా మాజీ సభ్యులు సతీష్ వేమన - జయరాం కోమటి వంటి వారు కొందరు చంద్రబాబును కలిశారు. మరి భువనేశ్వరి హోటల్ గదిలో ఉన్నారో ఏమో చంద్రబాబు మాత్రమే వారితో కలిసి అలా తిరుగుతూ షాపింగ్ ను పరిశీలించారు.
వారితో కలిసి జోకులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లారు. ఓ పాప్ కార్న్ షాపు వద్ద ఆగి కాసేపు మాట్లాడారు. కచ్చితంగా భువనేశ్వరి డైట్ ను పాలో అవుతుంటారు చంద్రబాబు. ఆమె పక్కన లేకపోవడంతో సార్ మేడమ్ లేరు... ఐస్ క్రీమ్ టేస్ట్ చేయొచ్చుగా అంటూ వారు సరదాగా బాబును అడగ్గా... నవ్వుతూ అలా ముందుకు వెళ్లిపోయారు బాబు. ఇంటర్నెట్ లో ఈరోజు బాబు వీడియోలు అలా వైరల్ అయ్యాయి.
అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే... అధికారంలో ఉన్నా లేకున్నా ఇలా సరదాగా కాఫీ షాపులు - రెస్టారెంట్ల చుట్టూ తిరిగే అవకాశం అస్సలు దొరకదు బాబుకు. అందుకే తెలుగువారు కూడా తక్కువగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లారు. చాలా దగ్గర వారు మాత్రం అమెరికాలోని పలు చోట్ల నుంచి బాబును కలవడానికి వచ్చారు. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టారని చెప్పుకున్నా స్థానికులు మాత్రం ఎవరూ బాబును సూచాయగా కూడా గుర్తుపట్టినట్లు కనిపించలేదు. రాజకీయాలు పక్కన పెడితే... బాబు ఉల్లాసాన్ని చూసి తెలుగు ప్రజలు బాగానే రియాక్ట్ అయ్యారు. చిల్ బాబు చిల్ అని కొందరు కామెంట్లు చేశారు. ఎన్నాకెన్నాళ్లకు చంద్రబాబు ఖాళీగా ఉన్నారని మరికొందరు వ్యాఖ్యానించారు.