Begin typing your search above and press return to search.
పవన్ దెబ్బతో బాబు బ్యాచ్ కు నిద్ర మిస్!
By: Tupaki Desk | 18 March 2018 11:14 AM ISTజనసేన ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ.. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనను కడిగిపారేసిన పవన్ తన వ్యాఖ్యలతో సంచలనాన్ని సృష్టించటమే కాదు.. టీడీపీ వర్గాలకు ఏ మాత్రం మింగుడుపడనట్లుగా మారారు. ఆవిర్భావ సభ అంటే.. ఏదో సింపుల్ గా చేసుకుంటాడని అనుకున్నాం కానీ..ఇన్నేసి బాంబులు పేలుస్తాడని అస్సలు అనుకోలేదని టీడీపీ తమ్ముళ్లు తమ ప్రైవేటు మీటింగుల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
మిత్రుడిగా ఉన్న పవన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ మద్దతు ఇస్తాడని.. అతడికి అంతకు మించిన ఆప్షన్ లేదన్న తమ్ముళ్లు.. ఇప్పుడు పవన్ విమర్శలతో కంగారు పడుతున్నారు. అధినేత దక్షత మీద విమర్శల కంటే.. తమ చోటా బాస్ మీద పవన్ కురిపించిన విమర్శలపై ఉక్కిరిబిక్కిరి పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక సభతో ఇద్దరు బాసులకు చుక్కలు చూపించిన పవన్ దెబ్బకు బాబు బ్యాచ్ లోని పలువురికి నిద్ర మిస్ అయినట్లుగా తెలుస్తోంది. పవన్ తిరుగుబాటు స్వరం తమకు చేసే నష్టం మీదన లెక్కలు కట్టటంలో కొందరు తెలుగు తమ్ముళ్లు చాలా బిజీ అయినట్లుగా తెలుస్తోంది.
బహిరంగ సభ అంటే.. ఏదో కాస్త హడావుడి చేస్తాడనుకున్నామే కానీ.. ఇన్నేసి సంచలనాలు ఉంటాయని తామే మాత్రం ఊహించలేదన్న మాట పలువురు సీనియర్ నేతల నోట వస్తోంది. నాలుగేళ్ల మిత్రత్వాన్ని ఒక్క సభతో తుంచేయటం తమ్ముళ్లకు మింగుడుపడనిదిగా మారింది. పవన్ వెనుకాల ఎవరు ఉన్నారన్న దానిపై వారు ఆరా తీయటమే కాదు.. పవన్ కదలికలపై మరింత నిఘా పెంచాలన్న భావన వ్యక్తమవుతోంది.
2019 ఎన్నికల్లో కాస్త కష్టపడితే మరోసారి అధికారం పక్కా అన్న భ్రమల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లకు అసలు వాస్తవం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిన్న మొన్నటి వరకూ సేఫ్ అన్న భావనలో ఉన్న బాబు బ్యాచ్ కు పవన్ ఇప్పుడో పెద్ద తలనొప్పిగా మారినట్లుగా వారి మాటలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.