Begin typing your search above and press return to search.
అదిరేలా పవన్..బాబుల ఇచ్చిపుచ్చుకోవటాలు!
By: Tupaki Desk | 7 Sept 2017 12:50 PM ISTకొత్త తరహా రాజకీయం ఏపీలో మొదలైంది. వేదికలు వేరుగా ఉన్నా.. గుట్టుగా కలిసి మెలిసి ఉన్న తీరు ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతోంది. ప్రశ్నించేందుకే రాజకీయపార్టీ పెట్టినట్లుగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఒక చిత్రమైతే.. ఆయనకు తగినట్లే వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు మరింత విచిత్రంగా చెప్పాలి.
ఏపీలో బాబు పాలన మీద సగటుజీవి చిరాకును అస్సలు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారు పవన్. కానీ.. ఎంపిక చేసిన కొన్ని సమస్యలు.. కొన్ని వర్గాలు పవన్ కోటరీలోకి వెళ్లగలగటమే కాదు.. ఆయన్ను కలుసుకొని తమ వెతల్ని చెప్పుకుంటున్నాయి.
ఆ వెంటనే.. ఆయన ఏపీ సర్కారుకు వినయంతో.. విధేయతతో అల్టిమేటం జారీ చేస్తున్నారు.ఆ వెంటనే.. గాఢనిద్ర నుంచి ఉలిక్కిపడినట్లుగా లేచి.. పవన్ జారీ చేసిన అల్టిమేటంను ఆయనిచ్చిన టైమ్ లైన్ లోపు పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలో.. కొన్నిసార్లు అధికారపక్షానికి తన అల్టిమేటం ఇబ్బందిగా మారుతుందని అనిపిస్తే ఆ వెంటనే పవన్ ఆ విషయం మీద మరిక నోరు విప్పని పరిస్థితి.
అమరావతి భూసేకరణ విషయంలో కాస్త హడావుడి చేసిన పవన్ కల్యాణ్.. బాబు సర్కారుకు అల్టిమేటం జారీ చేయటం.. దానికి ప్రతిగా బాబు రియాక్ట్ అయినట్లుగా కనిపించింది. అయితే.. అక్కడి రైతులు కోరుకున్నదేదీ జరగకున్నా.. పవన్ మరిక మాట్లాడకపోవటం కనిపిస్తుంది.
రాజధాని భూముల విషయంలోనే కాదు.. మెగా అక్వాపార్క్ విషయంలోనూ ఇలాంటి సీనే కనిపిస్తుంది. పవన్ అభ్యంతరం వ్యక్తం చేయటం.. దానిపై బాబు సర్కారు చర్యలు తీసుకుంటున్నట్లుగా కలరింగ్ ఇవ్వటం.. దాంతో పవన్ సంతృప్తిపర్చటం కనిపిస్తుంది. ఈ మధ్యనే ఏపీ అగ్రికల్చర్ విద్యార్థులు తమ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లటం.. వారు డిమాండ్ చేసిననట్లుగా జీవోను రద్దు చేయాలన్న మాట పవన్ నోట రావటం.. అందుకు స్పందించిన ఏపీ సర్కారు తాజాగా విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేయటం కనిపిస్తుంది. ఆవెంటనే తన మాటకు విలువనిస్తూ ఏపీ సర్కారు స్పందించిన తీరుకు పవన్ థ్యాంక్స్ చెప్పేశారు.
ఇలా ఎంపిక చేసిన కొన్ని అంశాల విషయంలో పవన్ మాటను చంద్రబాబు గౌరవిస్తూ.. ఆయన్ను మెప్పిస్తూ.. సంతృప్తి పరుస్తున్నారు. అదే సమయంలో బాబుకు ఇబ్బంది కలిగించే అంశాల మీద దృష్టి పెట్టని రీతిలో పవన్ వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇలా.. ఇరువురికి ఇబ్బంది కలగని రీతిలో ఇచ్చిపుచ్చుకునే ఎపిసోడ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో కలిసి పోటీ చేయాల్సిన నేపథ్యంలో.. మరీ కలిసిపోయినట్లుగా వ్యవహరించే కన్నా.. దూరంగా ఉంటూనే.. ఎవరికి వారు.. వారి.. వారి ప్రయోజనాల్ని ప్రొటెక్ట్ చేసుకునే తెలివి చూస్తే అయ్యారే అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఏమైనా ఇచ్చిపుచ్చుకోవటంలో పవన్.. బాబుల రూటే సపరేటు అని చెప్పక తప్పదు.