Begin typing your search above and press return to search.
నమ్మినోళ్లను ముంచడం..బాబుకు వెన్నతో పెట్టిన విద్య
By: Tupaki Desk | 9 March 2018 11:15 AM ISTరాజకీయంగా తన పబ్బం గడుపుకోవడం ఒక్కటే ఆయనకు ప్రయారిటీ... దానికోసం ఎవరిని ఎలా వాడుకోవడానికైనా ఆయన వెనుకాడడు. ఎవరిని ఎలా ముంచేయడానికైనా.. ఆయన సందేహించడం. ఆయనే చంద్రబాబు.. ఇలా అవసరం కోసం బంధం కలుపుకోవడమూ... అవసరం తీరిపోయిందని అనిపించినా... బంధం భారంగా మారుతున్నదని అనుమానం కలిగినా.. వెంటనే ఆ బంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంచేసుకోవడమూ.. తనను నమ్మి పొత్తులు పెట్టుకున్న పార్టీని.. గంగలో కలిపేయడమూ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శలు ఇప్పుడు విపరీతంగా వినిపిస్తున్నాయి.
చంద్రబాబునాయుడు తాజాగా భారతీయజనతా పార్టీ తో పెట్టుకున్న పొత్తును తెంచేసుకోవడం గురించి.. రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ నడుస్తున్నది. మంత్రుల్ని మాత్రం కేంద్రంనుంచి తప్పించి... సంకీర్ణంలో మాత్రం ఆయన ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఎందుకు కొనసాగుతున్నారు. ఎందుకంటే- తన వైఖరి ఏమిటో- తన మాయోపాయం ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు గనుక- దానిని బాహ్య ప్రపంచం గుర్తించేసి.. ఆ మేరకు తన మీద నిందలు వేయకుండా ఉండడానికి మాత్రమే చంద్రబాబు ఈ పనిచేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది.
నమ్మిన వాళ్లని, లేదా తన అవసరం కొద్దీ పొత్తులు పెట్టుకున్న వాళ్లని నట్టేట ముంచడం ఆయన నైజం అని పలువురు ఆరోపిస్తున్నారు. 1978లో చాలా చిన్నవయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన చంద్రబాబునాయుడు.. అడుగుపెట్టిన పార్టీనే ముంచడానికి అప్పట్లోనే స్కెచ్ ప్రారంభించాడా అనిపిస్తుంది. ఎందుకంటే.. పార్టీ పెట్టాల్సిందగా ఎన్టీఆర్ కు తానే పలుసందర్భాల్లో సలహా చెప్పానంటూ ఆయన చాటుకున్న సంగతి తెలిసిందే. అదే 1994 వచ్చేసరికి.. అప్పటిదాకా పార్టీ మీద తనకు పెత్తనం ఇచ్చిన ఎన్టీఆర నే వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్నాడనే ఆరోపణలూ ఉన్నాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతూ.. ఆ ప్రభుత్వాల్ని ముంచారు. ఫ్రంట్ ఛైర్మన్ గా రాజీనామా చేయకుండానే.. భాజపా వాజపేయి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. దాన్ని కూడా వదిలించుకుని.. భాజపా తో పొత్తు చారిత్రక తప్పిదం అంటూ లెంపలు వేసుకున్నారు. ఆ ప్రభుత్వాన్ని కూల్చారు.
విభజనకు ముందు తెరాస తో ఎన్నికల పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఓడిపోయిన వెంటనే.. ఆ పార్టీని కూడా ముంచేయడం విశేషం. తాజాగా 2014 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పొత్తు పెట్టుకున్న భాజపాను ఇప్పుడు ముంచాడని అంతా అనుకుంటున్నారు. చంద్రబాబును నమ్మిన వాళ్లు మూర్ఖులే తప్ప.. తొలినుంచి ఆయన తన నైజం ఒకే తరహాలో నిరూపించుకుంటున్నారని పలువురు అంటున్నారు.